కేంద్ర బడ్జెట్, ఎస్సీ సైకిల్ గుర్తుపై ఈసీ ఏమన్నాడంటే.. cec not given clarity on union budget, sp's cycle symbol

Cec not given clarity on these two issues

samjawadi party, cycle symbol, union budget, five states assembly elections, election commission, elections schedule, Supreme Court, cec nasim zaidi, uttar pradesh, punjab, manipur, uttarkhand, goa, state assembly elections, politics

Five state Assembly elections notification keeps Union budget in dilema, Chief Election Commissioner Nasim Zaidi says will discuss and decide on the issue. On SP's cycle symbol also he doest gives clarity.

ఎన్నికల కమీషన్ తేల్చని రెండు అంశాలు ఇవే..

Posted: 01/04/2017 01:48 PM IST
Cec not given clarity on these two issues

దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. దేశ ప్రజలకు సంబంధించిన ఒక్క అంశంతో పాటు అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రవాసులకు సంబంధించిన మరో అంశంపై మాత్రం ష్పష్టతను ఇవ్వలేదు. ముందుగా దేశ ప్రజలకు సంబంధించిన అంశమైన కేంద్ర బడ్జెట్ విషయంలో క్లారీటీ ఇవ్వని కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమాధానం చెప్పగా, ఉత్తర్ ప్రదేశ్ అధికార సమాజ్ వాదీ పార్టీకి చెందిన సైకిల్ గుర్తును ఎవరికీ కేటాయిస్తున్నారన్న అంశంపై కూడా స్సష్టను ఇవ్వలేదు. ఈ అంశంలో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి వుంటామని తెలిపింది.

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న 2017-18 బడ్జెట్ పై చర్చించి, త్వరలో నిర్ణయాన్ని వెలువరిస్తామని ఈసీ నజీమ్ జైదీ వెల్లడించారు. 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న వేళ, పలు రాష్ట్రాల ప్రతిపక్షాల నుంచి తమకు అభ్యంతరాలు అందాయని అయన వెల్లడించారు. అందిన ఫిర్యాదులపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, బడ్జెట్ ను ప్రతిపాదించేందుకు ఈసీ అంగీకరించకుంటే, బడ్జెట్ సమర్పణ మార్చి 11వ తేదీ తరువాతకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమాజ్ వాదీ ఎన్నికల గుర్తును ఎవరికీ కేటాయిస్తారన్న మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చిన ఈసీ నజీమ్ జైదీ.. సైకిల్ గుర్తు తమకు కావాలని ములాయం సింగ్ యాదవ్ వర్గం, తమకే చెందాలని అఖిలేష్ వర్గం ఈసీని స్పందించాయని, ఈ మేరకు వారి వినతులు, సంబంధిత పత్రాలను సమర్పించాయని తెలిపారు. వీటన్నింటినీ పరిశీలిస్తున్నామని, గతంలో ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఈసీ వెల్లడించిన నిర్ణయాలను గురించి తెలుసుకుని, చట్టాలను పరిశీలించిన తరువాత తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని జైదీ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh