ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా, ఫలితాలు మార్చి 11న Five states voting results on March 11

Five states to vote between february 4 and march 8

five states assembly elections, election commission, elections schedule, Supreme Court, cec nasim zaidi, uttar pradesh, punjab, manipur, uttarkhand, goa, state assembly elections, politics

Assembly elections in Uttar Pradesh, Uttarakhand, Goa, Punjab and Manipur will be held between February 4 and March 8, Chief Election Commissioner Nasim Zaidi announced

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా, ఫలితాలు మార్చి 11న

Posted: 01/04/2017 12:54 PM IST
Five states to vote between february 4 and march 8

దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో ఫిబ్రవరి 4 నుంచి మరా్చి 8వ తేదీల మధ్య అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నసీం జైదీ షెడ్యూల్‌ వివరాలు వెల్లడించారు. గోవా, పంజాబ్ లలో ఫిబ్రవరి 4న ఒక్క పర్యాయంలోనే ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. రాత్రి 10 నుంచి తెల్లారి 6 గంటల వరకూ ఎలాంటి లౌడ్ స్పీకర్లూ వాడరాదని, నిబంధనలు మీరితే చర్యలుంటాయని హెచ్చరికలను జారీ చేసింది.  

కాగా, ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించనున్నామని, అలాగే మణిపూర్ లో రెండు విడుతలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 4, మార్చి 8 తేదీలలో మణిపూర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అత్యంత పెద్దది, అన్ని పార్టీలకు కీలకంగా మారిన ఉత్తర్ ప్రదేశ్ లో403 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రం ఏడు విడతలుగా ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 11, 5, 19, 23, 27, మార్చి 4, ఎనమిది తేదీలలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అన్ని రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన తరువాత మార్చి 11 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని నసీం జైదీ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. 16 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నియామవళి ఈరోజు నుంచే అమల్లోకి రానుంది. ఉత్తర్ ప్రదేశ్ లో 403 స్థానాలు, గోవాలో 40 స్థానాలు, పంజాబ్ లో 117 స్థానాలు, మణిపూర్ లో 60 స్థానాలు, ఉత్తరాఖండ్ లో 70 స్థానాలు వున్న అసెంబ్లీ సెగ్మంట్లకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ లలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమ ప్రచారం కోసం అయా నియోజకవర్గాలలో 28 లక్షల రూపాయల వరకు నిధులను ఎన్నికల కోసం ఖర్చు చేసేందుకు ఎన్నికల కమీషన్ అనుమతినివ్వగా, మణిపూర్, గోవాలలో మాత్రం 20 లక్షలకు మించరాదని పేర్కోంది. ఇదిలావుండగా, ప్రతీ అభ్యర్థి తన అస్తులకు సంబంధించిన అఫిడెవిట్ తో పాటు తాను భారతీయుడ్నీ అన్న అఫిడవిట్ కూడా సమర్పించాల్సి వుంటుంది. దీంతో పాటు విద్యుత్, ఇంటి పన్ను, నీటి బిల్లులకెు సంబంధించి నో డ్యూ సర్టిఫికెట్ల్ లను కూడా అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి వుంటుంది.

అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా నగదు ఖర్చును అంగీకరించేది, ఈ విషయంలో తమకు ఫిర్యాదులు వస్తే, కఠినంగా వ్యవహరిస్తామని, విచారణలో తప్పు చేసినట్టు తేలితే, అభ్యర్థిపై అనర్హత వేటు సహా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని తెలిపింది. ప్రతి అభ్యర్థీ విధిగా ఎన్నికల ఖాతాను ప్రారంభించాలని, దాన్నుంచే కేటాయింపులు జరపాలని ఆదేశించింది. బ్యాంకుల ద్వారా కాకుండా చెల్లింపులు జరపాల్సి వస్తే, చెక్కులు జారీ చేయాలని సూచించింది. రూ. 20 వేల కన్నా అధిక మొత్తంలో డొనేషన్లు వస్తే, అది చెక్కులు లేదా డీడీల రూపంలో మాత్రమే ఉండాలని పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ ఖర్చులపై పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ప్రకటించాలని ఆదేశించింది.

పెయిడ్ వార్తలు రాసే పత్రికలకు అందే అన్ని రకాల ప్రోత్సాహకాలనూ తొలగిస్తామని ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ తరఫున కమిటీని నియమించామని, వారిచ్చే రిపోర్టు ఆధారంగా మీడియాపై కూడా చర్యలు తప్పవని ఈసీ పేర్కొంది. కొన్ని టీవీ చానళ్లు పొలిటికల్ పార్టీలు, కొంతమంది అభ్యర్థుల అధీనంలో నడుస్తున్నాయన్న విషయం తమకు తెలుసునని, ఈ టీవీ చానళ్లలో తమకు సంబంధించిన వారి గురించి వార్తలు, ప్రచారం వస్తే, మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసింది. ప్రతి వార్తనూ పరిశీలించి, దాన్ని వాణిజ్య ప్రకటనగా పరిగణించి, అభ్యర్థి ఖర్చులో జమ చేయనున్నట్టు తెలిపింది. మరిన్నీ ముఖ్యాంశాలు..

* పూర్తి పారదర్శకమైన ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
* గడచిన సంవత్సర కాలంగా ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా కసరత్తు జరిపాం
* లక్షలాది తప్పులను, ఒకే ఓటర్ పలు చోట్ల నమోదు అయిన తప్పులనూ నివారించాం.
* తుది ఓటర్ల జాబితాలు గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో 5న, ఉత్తరాఖండ్ లో 10న, ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో 12న విడుదలవుతాయి.
* మొత్తం 16 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
* దాదాపు 100 శాతం ఓటర్లకు గుర్తింపు కార్డులున్నాయి.
* కొత్తగా నమోదైన ఓటర్లకు ఎన్నికల లోపు కార్డులు ఇస్తాం.
* పోలింగ్ కేంద్రాలకు గుర్తింపు కార్డులు తీసుకెళ్లడం తప్పనిసరి.
* ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందరికీ అందుబాటులో ఉంచుతాం.
* ప్రతి కుటుంబానికీ, ఆయా కుటుంబంలోని ఓటర్ల కలర్ ఫోటోలతో కూడిన జాబితాను అందిస్తాం.
* ఇందులోనే వారు ఓటు వేయాల్సిన పోలింగ్ స్టేషన్, ఎన్నికల తేదీ, సమయం వివరాలు కూడా ఉంటాయి.
* ఐదు రాష్ట్రాల్లో మొత్తం 1.85 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం.
* 2012 ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య 15 శాతం అధికం.
* అన్ని పోలింగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు కల్పిస్తాం.
* ప్రతి పోలింగ్ స్టేషన్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పిస్తాం.
* ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు.

యూపీలో ఎస్పీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా... గోవాలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీ–బీజేపీ సంకీర్ణం పాలకపక్షాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల పోలింగ్‌ సమయానికి ప్రధాని మోదీ ప్రభుత్వానికి దాదాపు మూడేళ్లు నిండుతాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసుకున్న కారణంగా యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 102 నియోజకవర్గాలున్న ఈ ఐదు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ సాధించే ఫలితాలను మోదీ పనితీరుకు గీటురాయిగా పరిగణించే అవకాశముంది. దీంతో పాటు నల్లధనం, అవినీతి నిర్మూలణ పేరుతో మోదీ సర్కార్ నవంబర్ 8న తీసుకున్న పెద్దనోట్ల రద్దు చారిత్రక నిర్ణయంపై కూడా రానున్న ఎన్నికలు రెఫరెండంలాంటివని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh