కొత్త చీఫ్ జస్టిస్ గా సిక్కు వ్యక్తి.. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం | Justice Jagdish Singh Khehar first Sikh man sworn as Chief Justice of India.

Justice khehar takes over as chief justice of india

Justice Jagdish Singh Khehar, Chief Justice of India, 44th Chief Justice of India, NJAC Act president, first Sikh Chief Justice, Supreme Court of India

Justice Jagdish Singh Khehar is the 44th Chief Justice of India and also the first Sikh to hold the office.

సుప్రీంకోర్టు చరిత్రలోనే ఫస్ట్ టైం

Posted: 01/04/2017 11:46 AM IST
Justice khehar takes over as chief justice of india

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం 44వ చీఫ్ జస్టిస్ గా ఆయనచే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు.

ప్రధాన న్యాయమూర్తి పొజిషన్ కు సీనియర్ న్యాయమూర్తి అయిన 64 ఏళ్ల ఖేహర్ సరైన వ్యక్తి అని పదవి విరమణకు ముందు టీఎస్ థాకూర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ఖేహర్ నియామకంకు మద్ధతు తెలుపుతూ ఆదేశాలు జారీ చేశారు.

దేశ చరిత్రలో సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. వివాదాస్పద జడ్జిల నియామక కమిటీకి కూడా ఈయనే సారథ్యం వహించనున్నాడు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రతిపక్షాలు డుమ్మా కొట్టగా, ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆగస్టు 27 వరకు అంటే దాదాపు 8 నెలల పాటు ఖేహర్ ఈ పదవిలో ఉంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court of India  New Chief Justice  Jagdish Singh Khehar  

Other Articles