సినిమా ఛాన్సు.. వైజాగ్ యువతుల న్యూడ్ ఫోటోలు.. ఆపై బ్లాక్ మెయిలింగ్ | Vizag girls complaint on short film maker.

Short film maker cheating girls in vizag

Nikhil waida, Short Film Nikhil, Vizag short film maker, Short film arrest, Short film nude photos, Movie Chances Cheating, short film maker arrest, dress changing photos, Girl blackmail, Vizag girls cheated,

Nikhil waida a short film maker from Vizag arrested for cheating girls on the name of movie chances. Filming them while dress changing and later black mail.

షార్ట్ ఫిలిం పేరుతో నగ్న దృశ్యాల షూటింగ్

Posted: 01/04/2017 08:59 AM IST
Short film maker cheating girls in vizag

ఛాన్స్ లు ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ఓ కీచకుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్ పేరుతో అమ్మాయిలకు ఎరవేసి ఆపై వారి బూతు పురాణంతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ బీటెక్ విద్యార్థి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి.

విశాఖ‌ప‌ట్నం కి చెందిన ముగ్గురు యువతుల‌కు మాయ‌మాట‌లు చెప్పిన వైడా నిఖిల్(24) అనే ఓ బీటెక్ పైనల్ ఇయర్ విద్యార్థి వారిని మోసం చేశాడు. యువ‌తుల‌ న‌గ్న దృశ్యాలు చిత్రీక‌రించి త‌న కోరిక తీర్చాలంటూ వేధింపుల‌కు గురిచేశాడు. త‌ను చెప్పిన‌ట్టు విన‌కుంటే ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెడ‌తానంటూ బెదిరించాడు. దీంతో యువతులు కంచ‌ర‌పాలెం పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో నిఖిల్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

షార్ట్ పిల్మ్ లు తీసే నిఖిల్ ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో ప‌రిచ‌యం పెంచుకున్న ఆమెను ప్రేమిస్తున్న‌ట్టు చెప్పి గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. త‌ర్వాత ఫేస్‌బుక్‌లో మ‌రో యువ‌తికి గాలం వేసిన నిఖిల్ ఆమెకు సినిమాల్లో న‌టించాల‌ని ఉంద‌న్న ఆస‌క్తిని గుర్తించి మోసానికి ప్ర‌ణాళిక సిద్ధం చేశాడు. షార్ట్ ఫిలిం కోసం ఫొటో షూట్ చేస్తానంటూ ఇంటికి ర‌ప్పించుకుని కాస్టూమ్స్ టెస్ట్ అంటూ ఆమె నగ్న ఫోటోలు తీశాడు. ఆపై ఆ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వాడుకున్నాడు.

అంతేకాదు ఆమెకు వ‌చ్చిన పెళ్లి సంబంధాల‌ను చెడగొట్టాడు. మ‌రో అమ్మాయికి కూడా ఇదే విధ‌మైన అనుభ‌వం ఎదురైంది. దీంతో అత‌డి ఆగ‌డాల‌పై సదరు యువతులు కంచెరపాలెం పోలీసుల‌కు ఫిర్యాదు చేయటంతో కటకటాల వెనక్కి నెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishakapatnam  short film maker  Nikhil  cheat girls  arrest  

Other Articles

Today on Telugu Wishesh