అర్థరాత్రి దాటాక భారీ భూకంపం.. సునామీ అలజడి | Fiji earthquake tsunami threat passes.

Strong earthquake hits near fiji

Fiji earthquake, Fiji tsunami, Pacific Ocean Earthquake, Fiji news, tsunami threat, Strong earthquake, 6.9 earthquake Fiji

Fiji strong earthquake Tsunami warning lifted after 6.9 earthquake strikes in Pacific Ocean.

ఫసిఫిక్ తీరంలో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్

Posted: 01/04/2017 08:36 AM IST
Strong earthquake hits near fiji

ఫసిఫిక్ తీర దేశాలు సునామీ హెచ్చరికలతో మరోసారి వణికిపోయాయి. ఫిజీ దేశ తీర ప్రాంతంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 గా నమోదు కాగా, సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం నాది ప్రాంతానికి నైరుతి దిశగా 227 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు అందాల్సి ఉంది. నాది ఐలాండ్ టూరిజంకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. భూకంపంతో ప్రజలంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.

ఇక పసిఫిక్ తీర ప్రాంత దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి, అనంతం పరిస్థితి సర్దుమణగటంతో వాటిని ఉపసంహరించుకున్నారు. భూకంపం సమయంలో పెద్ద ఎత్తున్న అలలు ఎగిసిపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యుత్ అంతరాయం, పలు భవనాలు నేల మట్టం కావటంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.

భారత్ లోనూ ప్రకంపనలు...
ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం వేకువజామున భూ భూకంపం సంభవించింది. త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. త్రిపురలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైంది. కమల్ పూర్‌లో పలు ఇళ్లు బీటలు వారాయి. భూకంప భయంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లో కురుంగ్ కుమె జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదయిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Strong earthquake  Fiji  tsunami alert  

Other Articles