చిన్నమ్మ పట్టాభిషేకంకు ముహుర్తం ఖరారైందా? | Sasikala sworn as chief minister for pongal.

Chinnamma is inching towards becoming tamil nadu cm

Tamil Nadu, Chinamma, Sasikala Natarajan, DMK working president, Stalin, Sasikala Natarajan, Tamil Nadu Chief Minister, Sasikala Pongal, Jayalalithaa aide new CM, AIADMK DMK meetings, Tamil Nadu cabinet meeting, Sasikala Natarajan New CM

All clear for Chinamma Sasikala Natarajan to become Chief Minister of Tamil Nadu. Stalin set to be DMK's first working president.

సీఎంగా చిన్నమ్మ ఇంచు దూరంలో....

Posted: 01/04/2017 09:27 AM IST
Chinnamma is inching towards becoming tamil nadu cm

పార్టీ చీఫ్ గానే కాదు, సీఎంగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు శ‌శిక‌ళ నటరాజన్ కు లైన్ క్లియర్ అవుతోంది. ప్రస్తుతం అక్కడ అంతా చిన్నమ్మ కనుసైగల్లోనే జరుగుతుందన్న విషయం తెలిసిందే. కింది స్థాయి నేతలు ప్రతిఘటిస్తున్నప్పటికీ, 62 ఏళ్ల శశి ముఖ్యమంత్రి కావాలంటూ సీనియర్లతోసహా పలువురు డిమాండ్ లేవనెత్తుతున్నారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సహా మంత్రులు ఆర్పీ ఉద‌య్‌కుమార్‌, సేవూరు రామచంద్ర‌న్‌, క‌డంబూరు రాజాలు తోడ‌య్యారు. శ‌శిక‌ళ‌ను క‌లిసి సీఎం ప‌గ్గాలు స్వీక‌రించాల్సిందేన‌ని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందనే సంకేతాలు అందుతున్నాయి.

నేడు(బుధ‌వారం) రాష్ట్ర క్యాబినెట్ అత్య‌వ‌స‌రంగా సమావేశం కానుంది. ఈ ఉద‌యం 9:30 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని మంత్రివ‌ర్గ స‌భ్యులు భేటీ కానున్నారు. కేబినెట్ స‌మావేశంలో సీఎంపై మార్పుపై వ‌స్తున్న వ‌దంతుల‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, మరోపక్క నేడు మ‌రిన్ని కీల‌క స‌మావేశాలు కూడా జ‌ర‌గ‌నున్నాయి. పార్టీ చీఫ్ శ‌శిక‌ళ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జిల్లా అధ్య‌క్షుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు.

మరోవైపు రెండు రోజుల క్రితం ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులు, నేత‌లు పోయెస్‌గార్డెన్‌లో చిన్న‌మ్మ‌తో స‌మావేశ‌మై సీఎం ప‌ద‌విపై మ‌రోమారు ఒత్తిడి తీసుకొచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈనెల‌లో జ‌ర‌గ‌నున్న పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎంజీ రామ‌చంద్ర‌న్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల నాటికి శ‌శిక‌ళ‌ను సీఎంను చేయ‌డ‌మే ధ్యేయంగా నేత‌లు ప‌నిచేస్తున్నారు. జిల్లాల వారీగా స‌మావేశాలు నిర్వ‌హించిన త‌ర్వాత రాష్ట్ర‌స్థాయిలో భారీ స‌మావేశం ఏర్పాటు చేసి సీఎంగా శ‌శిక‌ళ‌ను ఎన్నుకునేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

త‌మిళ‌నాడు ప్ర‌జ‌లకు ప‌విత్ర దిన‌మైన పొంగ‌ల్ పండుగ నాడు ముఖ్య‌మంత్రి ప‌దవిని అధిష్ఠించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈనెల 12న సీఎం ప‌గ్గాలను ఆమె చేతిలో పెట్టాల‌ని పార్టీ భావిస్తోంది.

డీఎంకే పోటాపోటీ సమావేశం...

అలాగే ప్ర‌తిప‌క్ష డీఎంకే కూడా నేడు స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశానికి రెండు నెల‌ల త‌ర్వాత పార్టీ చీఫ్ క‌రుణానిధి హాజ‌రుకానున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష నేత ఎంకే స్టాలిన్‌కు నిర్వాహ‌క అధ్య‌క్షుడి ప‌గ్గాలు అందించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఒకే రోజు అధికార‌, ప్ర‌తిప‌క్షాలు కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రోమారు వేడి రాజుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala Natarajan  Tamil Nadu New CM  DMK  New President  Stalin  

Other Articles