మాఫియా డాన్ కి కోలుకోలేని షాకిచ్చిన భారత్ | UAE govt seizes Dawood Ibrahim's assets.

Dawood ibrahim s assets seized in uae

Dawood Ibrahim, UAE, Dubai news, Dawood in Dubai, Dawood Ibrahim's assets, Dawood Ibrahim India, Dawood Ibrahim assets, Mumbai blasts 1993, Dawood Ibrahim 15000 cr

Mumbai blasts mastermind Dawood Ibrahim's assets worth Rs 15000 cr seized in UAE.

దావూద్ కి దుబాయ్ సర్కార్ షాక్

Posted: 01/04/2017 08:18 AM IST
Dawood ibrahim s assets seized in uae

మాఫియా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు గట్టి ఝలక్ తగిలింది. దుబాయ్ లో ఉన్న అక్కడి ప్రభుత్వం సీజ్ చేసేసింది. సుమారు 15,000 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం నిర్ధారించింది. ఇందులో దావూద్ కు సంబంధించిన స్థిర చరాస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారిగా ఉన్న దావూద్‌ ఇబ్రహీంకి సంబంధించిన ఆస్తుల సమాచారాన్ని దుబాయ్ ప్రభుత్వానికి భారత్ పంపించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన యూఏఈ ప్రభుత్వం అతని ఆస్తులను సీజ్ చేసింది.

కాగా, గతేడాది ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ యూఏఈ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రెండు దేశాల మధ్య నేరస్థుల విషయంలో సహాయసహకారాలు అందించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌ లో దావూద్‌ ఇబ్రహీం సోదరుడు గోల్డెన్‌ బాక్స్‌ పేరుతో ఓ కంపెనీని నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు.

మొరాకో, స్పెయిన్‌, యూఏఈ, సింగపూర్‌, థాయ్ లాండ్‌, సైప్రస్‌, టర్కీ, భారత్‌, పాకిస్థాన్‌, యూకెల్లో దావూద్‌ ఆస్తులు ఉన్నాయని భారత్ ఇంతకు ముందు నుంచి వాదిస్తూ వస్తోంది. కాగా, దావూద్ ను అప్పగించే విషయంపై పాక్ గనుక సానుకూలంగా స్పందించకపోతే, అంతర్జాతీయ న్యాయస్థానంతోపాటు, ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించే యోచనలో బారత్ ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai blasts  Mastermind  Dawood Ibrahim  Assets  seize  

Other Articles