ప్రేమ పేరుతో మోసం.. అపై అత్యాచారం.. Man held for raping techie on promise of marriage

Man held for raping techie on promise of marriage

techie rape case, Pune man, marriage promise, Dehu Road, Amit Jadhav, Pune Software Engineer Amit, Pune Rape case, Baramati, Maharashtra, crime news

A 28-year-old Pune resident was arrested for duping a Mumbai woman by posing as a software engineer on a matrimonial website and raping her after promising marriage.

పెళ్లి పేరుతో యువకుడి దురాగతం.. నలుగురిపై అత్యాచారం..

Posted: 01/03/2017 03:19 PM IST
Man held for raping techie on promise of marriage

ప్రేమ పేరుతో వంచించే మృగాల్లు వున్న ఈ సమాజంలోనే పెళ్లి పేరుతో మోసానికి తెరతీసే తోడేళ్లు కూడా వుంటాయని తెలియని అమాయక అబలలు అలాంటి మగమృగాళ్ల చేతికి చిక్కిశల్యమైన ఘటన ఇది. త్వరలో మనం బార్యభర్తలం కాబోతున్నామంటూ యువతులను నమ్మించి.. వారిని లొంగదీసుకుని అవసరం తీరగానే ప్లేటు ఫిరాయించిన ప్రబుద్ధుడ్ని ఎట్టకేలకు పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన హారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని బారామతికి చెందిన అమిత్ జాదవ్ ఉద్యోగ రీత్యా పుణేలో ఉంటున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో మ్యారేజ్ బ్యూరో వెబ్‌సైట్‌లో తాను సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ అంటూ ప్రకటన ఇచ్చాడు. ఆన్‌లైన్‌లో వివరాలను చూసిన పుణేకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువతి అమిత్‌ను సంప్రదించింది. ఇద్దరికి నచ్చడంతో మొబైల్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని తరచూ మాట్లాడుకునే వారు. అలా ఇద్దరి మధ్య కొంత సన్నిహిత్యం ఏర్పడింది.

ఒకరోజు తాను సంస్థ తరఫున రెండేళ్ల పాటు విదేశాలకు వెళుతున్నానని, ఈలోగా నిశ్చితార్థం చేసుకుందామని ఆ యువతికి తెలిపాడు. ఆ తర్వాత ఆమెను రావత్‌లోని తన ఫ్లాటుకు పిలిపించి పలుమార్లు అత్యాచారం చేశాడు. వీసా కోసమంటూ ఆ యువతి దగ్గర డబ్బు తీసుకున్నాడు. రెండు నెలల గడిచాక బాధితురాలిని వివాహం చేసుకోనని అమిత్ చెప్పాడు. అయితే తన దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వమని ఆమె అడిగితే ఇవ్వడానికి నిరాకరించాడు.

దీంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరో యువతితో కలిసి ఉన్న సందర్భంలో అమిత్‌ను పుణే రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఆ యువతిని పోలీసులు ప్రశ్నిస్తే అతడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె నిరాకరించింది. గతంలో నిందితుడు ఇలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో నలుగురు యువతులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : techie rape case  Pune man  marriage promise  Dehu Road  Amit Jadhav  crime news  

Other Articles

Today on Telugu Wishesh