మా అశాకిరణం, కంటిచూపు మీరే: పవన్ తో బాధితులు no politician turned on kidney patients issue except pawan says doctors

Pawan kalyan is our only hope says kidney patients

pawan kalyan, jana sena, janasena, janasena pawan kalyan, ichchapuram, uddanam kidney patients, separate budget, kidney patients, janasena srikakulam, pawan kalyan srikakulam

uddanam kidney patients says janasena party chief pawan kalyan is the only person who turned to their problems and is the only ray of hope.

ITEMVIDEOS: మా అశాకిరణం, కంటిచూపు మీరే: పవన్ తో బాధితులు

Posted: 01/03/2017 12:22 PM IST
Pawan kalyan is our only hope says kidney patients

శ్రీకాకుళంలోని ఉద్దానం సహా 11 మండలాల్లో దశాబ్దాలుగా తిష్టవేసి.. అక్కడి ప్రజల ప్రాణాలను కబళించివేస్తున్న కిడ్నీ సమస్య గురించి కేవలం రెండు నెలల క్రితం తెలుసుకున్న ప్రముఖ సీనీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇవాళ వారిని కలసి వారితో ముఖాముఖి నిర్వహించారు. గత నెలలో ఇచ్ఛాపురంలోని ఉద్దానం ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన అనుకోకుండా వాయిదా వేశారు. అయితే అందుకు తనను క్షమించాలని తాను శ్రీకాకుళం పర్యటన వాయిదా వేసుకోవడానికి గల కారణాలను కూడా తెలిపారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అకస్మిక మృతి కారణంగానే తాను ఉద్దానం రాలేకపోయానని, అందుకు తనను క్షమించాలని కోరారు. జయలలిత మరణం నేపథ్యంలో తాను ముఖాముఖీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆ తరువాత తిరిగి మరోమారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొంత సమయం పట్టిందన్నారు. ఈ సందర్భంగా పలువురు కిడ్నీ పేషంట్లతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు డాక్టర్లు, విద్యావేత్తల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇద్దివానిపాలెం గ్రామం నుంచి వచ్చిన ఓ మహిళ, తన గ్రామపు దీనగాథను కళ్లకు కట్టేలా వివరించింది. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామంలోని వారందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాలేదని వాపోయింది. "పేద ప్రజలం. మత్స్యకులం మాది. సంద్రానికి వెళ్లితే బిడ్డా పాపలకు మందులు పోయించుకోలేక చాలా అవస్థ అయిపోతున్నాం. మొన్న పదిహేను దినాల కింద వచ్చారు. కల్యాణ్ బాబు దగ్గరకు మీరందరు కూడా వెళ్లాలని చెప్పినారు. చెప్పి, ఇవాళ ఉదయం బస్సు పంపించారు.

ఈ సందర్భంగా ఇద్దివానిపాలెం గ్రామం నుంచి వచ్చిన ఓ వృద్దురాలు తన అవేదనను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. కిడ్నీ రోగానికి నాలుగైదు సంవత్సరాలుగా మందులు వాడుతున్నామని, బాధలు భరించలేక చాలా అవస్థలు పడుతున్నామనింది. ఎవరూ పట్టించుకోని తరుణంలో తమ కంటూ ఓ నేత వచ్చాడని, తమ అర్థులను తీరుస్తాడన్న నమ్మకంతో సంతోషించి వచ్చామన్నారు. తమ గ్రామంలో సుమారు 300 మంది వరకు ఈ వ్యాధిభారిన పడ్డారని తెలిపారు. పవన్ తల్లీ తండ్రీ, తోడూ నీడ. సర్వం అతనేనని.. కోటి వేల జేగుర్లు పెట్టుకుంటున్నాం. అతనే దేవుడనేసి భావించేస్తూ ఉన్నామని తెలిపారు.

గత్యంతరం లేని పరిస్థితులలో చదువుకోవాల్సిన తమ చిన్నారి పిల్లల చేత కూడా పనులు చేయించి.. ఆ వచ్చిన డబ్బుతో వైద్యం కోసం ఖర్చుచేస్తున్నామని మరో బాధిత మహిళ కన్నీళ్ల పర్యంతమైంది. తాము ఎంతగా బాధపడినా.. ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ తమను పట్టించుకోలేదని, తమ జీవితాలకు, తమ వాళ్ల జీవితాలకు వున్న ఒకే ఒక్క అశాకిరణం, కంటి వెలుగూ పవన్ కల్యానేనని తెలిపారు. ఇక వైద్యులు కూడా కిడ్నీ వ్యాధి భారిన పడిన బాధితుల సమస్యలపై వారి అభిప్రాయాలను తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  ichchapuram  kidney patients  uddanam  state government  

Other Articles