బాధ్యతలు స్వీకరిస్తూ ఉద్వగానికి లోనైన చిన్నమ్మ Sasikala Natarajan breaks down while addressing party workers

Sasikala natarajan breaks down while addressing party workers

sasikala, sasikala natarajan, aiadmk general secretary, jayalalithaa, office in charge, party chief, party charges, late jaya lalithaa

Jayalalithaa, who had an iron grip over the ruling AIADMK in Tamil Nadu, held the general secretary post for over two decades.

బాధ్యతలు స్వీకరిస్తూ ఉద్వేగానికి లోనైన చిన్నమ్మ

Posted: 12/31/2016 03:11 PM IST
Sasikala natarajan breaks down while addressing party workers

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ శశికళ బాధ్యతలు స్వీకరించారు. పోయెస్ గార్డెన్ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు జయలలిత వాడిన కారులోనే శశికళ వెళ్లారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ‘చిన్నమ్మ..చిన్నమ్మ’ అంటూ నినాదాలు చేశారు. శశికళ ఫొటోలు, నినాదాలు ఉన్న టీ-షర్టులను ధరించిన ఆమె అభిమానులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అమె కార్యకర్తలను ఉద్దేశించి తొలిసారి మాట్లాడారు. జయలలిత మరణాన్ని ఇప్పటికే తాము జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. అమ్మ చూపిన బాటలోనే నడుస్తానని ఆమె చెప్పారు. అమ్మ ఎప్పటికీ తన హృదయంలోనే ఉంటారని కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

అమ్మ చేపట్టిన పనుల్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళతామని శశికళ స్పష్టం చేశారు. ప్రజల కోసమే ఈ పార్టీ అని అన్నారు. జయ ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జయ చూపిన బాటలోనే పార్టీ నడుచుకుంటుందని స్పష్టం చేశారు. అమ్మే మన శక్తి, మన ధైర్యం అని చెప్పారు. అమ్మే చూపిన బాటే మనకు మార్గదర్శి అని అన్నారు.అమ్మతో తనది 33ఏళ్ల అనుబంధమని కంటతడి పెట్టారు. నెచ్చెలి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. జయలలిత మరణిస్తారని ఊహించలేదని అన్నారు.

ఆస్పత్రిలో ఓ దశలో అమ్మపూర్తిగా కోలుకున్నారని.. ఆ సమయంలోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అమ్మ మనకు దూరమయ్యారని తెలిపారు. జయ మరణంతో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలంటే జయకు చాలా ఇష్టమని, వాటిని కాపాడేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పారు. కాగా, శశికళ మాట్లాడుతున్నంత సేపు కూడా నేతలు, కార్యకర్తల చప్పట్లు కొడుతూ ఆమెకు మద్దతు తెలిపారు. అనంతరం పార్టీ ఆఫీసు ముందుకు వచ్చిన చిన్నమ్మ.. తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు అభివాదం తెలిపారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles