అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు Arunachal gets full-fledged BJP govt

Arunachal gets full fledged bjp govt as pema khandu 32 others join saffron party

arunachal pradesh, pema khandu, bjp, ppa, arunachal crisis, arunachal cm, new arunachal cm, congress

Pema Khandu and 32 other MLAs of the PPA join the BJP, thus also making this the first state in the Northeast to have a full-fledged BJP government.

అధికార పార్టీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు

Posted: 12/31/2016 05:51 PM IST
Arunachal gets full fledged bjp govt as pema khandu 32 others join saffron party

అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరోమారు అధికార పార్టీకి అ పార్టీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఫెమా ఖండూను అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ (పీపీఏ)కు భారీ షాక్‌ తగిలింది. శనివారం ఆ పార్టీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరారు. దీంతో 60 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో పీపీఏకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌(పీపీఏ) వేటు వేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నాటి నుంచి పరిణామాలు మారుతున్నాయి.  నాయకత్వ మార్పు తప్పదని పీపీఏ వెల్లడించింది. అయితే ఖండూ చెప్పినట్టుగా ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేయడంతో పీపీఏకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖండూ సహా 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. బీజేపీ ఖండూకే తమ మద్దతు ప్రకటించింది. బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఖండూకు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ లభించినట్టయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arunachal pradesh  pema khandu  bjp  ppa  arunachal crisis  arunachal cm  new arunachal cm  congress  

Other Articles