బ్యాంకు అధికారుల లీల.. రైతు అకౌంట్లోకి రూ.2 కోట్లు Small Farmer Shocked To Find Rs 1.95 Cr in His SB Account

Small farmer shocked to find rs 1 95 cr in his sb account

Demonetisation, bank account, andhrapragath grameena bank, money, farmer sb account, bank officials fraud, emmiganuru, kurnool

A small time farmer Abraham of non-descript Peddakadabur village in Kurnool district was shocked to find that Rs 1,95 crore was deposited in his account.

బ్యాంకు అధికారుల లీల.. రైతు అకౌంట్లోకి రూ.2 కోట్లు

Posted: 12/31/2016 11:22 AM IST
Small farmer shocked to find rs 1 95 cr in his sb account

పాత పెద్ద నోట్ల రద్దు తరువాత పేదల అకౌంట్లలోకి డబ్బు అటోమెటిక్ గా వస్తుందని, అయితే వాటని పేదలు మాత్రం తిరిగి ఇవ్వవద్దని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ సెలవిచ్చినట్లగానే జరుగుతుంది కానీ., పెద్దలు వచ్చి పేదలను డబ్బులు ఖాతాలో వేసుకోండీ అని అడగకుండానే కొందరి పేదల అకౌంట్లలో డబ్బు చేరుతుంది.. అలాగే వారి ప్రమేయం కానీ, అనుమతి కానీ లేకుండానే ఏకంగా వారి అకౌంట్లలోనుంచి డబ్బు తరలివెళ్లిపోతుంది. ఇటీవల పంజాబ్ లోని టాక్సీ డ్రైవర్, ఆ తరువాత ఓ మహిళ, ఇలా పలు కథనాలు విన్న ప్రజలకు ఏకంగా మన అంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇలా జరిగిందని తెలిస్తే..  అవ్వాకవుతారు

ఓ రైతు ఖాతాలో అతని అనుమతి లేకుండానే రూ.కోటి జమ అవుతూ.. డ్రా అవుతున్న చిత్రమిది.. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ తంతు కొనసాగుతోంది. రైతు ఖాతాలో డబ్బులు జమవుతున్నట్టు.. అలాగే డ్రా అవుతున్నట్టుగా మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన అబ్రహం అనే రైతుకు అక్కడే ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇతని బ్యాంక్‌ అకౌంట్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి రోజూ భారీమొత్తంలో నగదు జమ అయి.. విత్‌డ్రా అవుతున్నట్టుగా అతని సెల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి.

వాటిని చూసి భయపడిన అబ్రహం.. తనకు తెలిసిన వ్యక్తి అయిన ఎమ్మిగనూరుకు చెందిన మల్లెల ఆల్‌ఫ్రెడ్‌రాజుకు శుక్రవారం రాత్రి తెలిపాడు. దీంతో ఆల్‌ఫ్రెడ్‌రాజు.. ఈ విషయాన్ని విలేకరులకు తెలియజేశారు. రైతు సెల్‌ నంబర్‌ 9989050379కు వస్తున్న మెసేజ్‌లను చూపించారు. ఇప్పటివరకు 68 మెసేజ్‌లు వచ్చాయన్నారు. 30వ తేదీ ఉదయం 11.24కు రూ.1,96,07926 జమ అయినట్లు.. సాయంత్రం 5.44కు రూ.1,33,48781 డ్రా అయినట్లు సెల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించారు. ఈ నగదు ల్యాన్ కో అమర్‌ కంటక్‌ పవర్‌ లిమిటెడ్‌ పేరున అబ్రహం అకౌంట్‌లో జమవుతోంది. ఈ భారీ మోసంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles