అక్కడ మగాళ్లు కనిపిస్తే.. ఫైన్ కట్టాల్సిందే..! Men found in ladies Metro coaches may face Rs 5000 fine

Men found in ladies metro coaches may face rs 5000 fine

Women compartment, metro women compartment, Metro trains, Delhi Metro, CMRS, men in women compartment, fine on men in women compartment, urban development ministry, offenders, railway, mero rail projects, 'Metro Rail Bill

Males (over 12 years) caught travelling in a Metro rail coach reserved for female or anyone caught travelling in drunken or intoxicated state would have to pay Rs 5,000 fine

అక్కడ మగాళ్లు కనిపిస్తే.. ఫైన్ కట్టాల్సిందే..!

Posted: 12/31/2016 10:13 AM IST
Men found in ladies metro coaches may face rs 5000 fine

అన్నింటా సగం అంటూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్న మహిళలకు అక్కడ మాత్రం ప్రత్యేక హోదా అందుకున్నారు. కేవలం వారికి మాత్రమే అక్కడ అనుమతి వుంది. దానిని ఉల్లంఘించిన పురుషపుంగములకు అక్కడ పరాభవాలు.. తరువాత జేబులకు చిల్లులు మాత్రం ఇకపై తప్పదు. ఇంతకీ ఆ స్థలం ఎక్కడంటారా.. మెట్రో రైళ్లు. ఇకపై ఆ రైళ్లలో మగాళ్లు అత్యంత జాగ్రత్తగా వుండాల్సిందే. రైలు కదులుతుందనో, లేక మరేదైనా కారణం చేతనో లేడీస్ కోచ్‌ల‌లో ఎక్కారో రూ. 5 వేలు జ‌రిమానాగా చెల్లించుకోవాల్సిందే.

ఈ మేరకు కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాద‌న‌లు నూతనంగా మెట్రో రైల్ బిల్లును తీసుకువస్తుంది. అందులో లేడీస్ కంపార్టుమెంట్లలో ఎక్కి ప్రయాణం చేసే మగవారి చేతి చమురును వదిలించే ప్రదిపాదనలను కూడా పట్టణాభివృద్ది శాఖ సిద్ధం చేసింది. 12 ఏళ్లు దాటిన అబ్బాయిలు ఎవరైనా వారికి జరిమానా విధించడం తథ్యమని ప్రతిపాదనల్లో పోందుపర్చారు.  మ‌ద్యం మ‌త్తులో జోగుతున్న పురుషులైనా సరే మత్తు దించిన తరువాత ఫైన్ కట్టాట్సిందే.దేశంలోని మెట్రో రైలు క‌లిగి ఉన్న అన్ని న‌గ‌రాల్లోనూ ఇది వ‌ర్తిస్తుంద‌ని అందులో పేర్కొంది.

లేడీస్ కోచ్‌ల‌లో ప్ర‌యాణిస్తూ దొరికిన పురుషుల‌కు భారీ జ‌రిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించ‌ే అవకాశాలను కూడా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ పరిశీలిస్తుంది. విద్రోహ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం, ప్ర‌యాణికుల‌ ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్ట‌డం వంటి నేరాల‌కు జీవిత కాల జైలు శిక్ష లేదంటే ప‌దేళ్ల జైలు శిక్ష విధించ‌నున్నారు. అలాగే రైలులో తిన‌డం, కోచ్‌ల‌ను అప‌రిశుభ్రంగా మార్చేవారికి రూ. వెయ్యి జ‌రిమానా విధించాల‌ని ప్ర‌తిపాద‌న‌ల్లో పేర్కొన్నారు.అయితే రాత్రి వేళ రైళ్లలో ప్రయాణాలు చేసే మహిళలకు ఈ బిల్లు కొంత ఊరటనిస్తుంది,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women compartment  metro women compartment  Metro trains  Delhi Metro  CMRS  'Metro Rail Bill  

Other Articles