మద్రాసు హైకోర్టు నోటీసులిస్తే సమాధానమిస్తాం: వెంకయ్య venkaiah naidu on madras hc comments on jayalalithaa death case

Cr saraswathi respond madras hc comments on jayalalithaa death case

cr saraswathi, Jayalalithaa death case, Madras HC, justice vaidyalingam, venkaiah naidu, apollo hospital, paneer selvam

union minister venkaiah naidu said media, if madras high court issues notices on jayalalitha death case, then we will respond and send answer to the court.

మద్రాసు హైకోర్టు నోటీసులిస్తే సమాధానమిస్తాం: వెంకయ్య

Posted: 12/29/2016 05:17 PM IST
Cr saraswathi respond madras hc comments on jayalalithaa death case

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేతి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన మద్రాసు హైకోర్టు నోటీసులిస్తే వాటికి తాము సమాధానాలు ఇస్తామని కేంద్ర మంత్రి వెంక్యనాయుడు అన్నారు. జయలలిత అకస్మిక మరణం నేపథ్యంలో అనుమానాలను వ్యక్తం చేసిన రాష్ట్రోన్నత కోర్టు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. న్యాయస్థానంపరిధిలో వున్న అంశంపై తాను ఇంతకంటే అధికంగా మాట్లాడలేనని అన్నారు. జయలలిత మృతి అపోలో అస్పత్రి వర్గాలు, ఎయిమ్స్ వైద్యులు చెప్పిన విషయాలను తాము నమ్ముతున్నామని వెంకయ్య అన్నారు.

కాగా జయలలిత మృతిపై దాఖలైన పిటీషన్లను ఇవాళ విచారించిన న్యాయస్థానం సదరు పిటీషన్లను వెకేషన్ కోర్టు నుంచి రెగ్యూలర్ కోర్టుకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా న్యాయస్థానం జయలలిత మీతిపూై అనుమానాలు వ్యక్తం చేశారు. తనుకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యలింగం పేర్కొన్నారు. జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తామేందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. జయ మరణం తర్వాతైనా వాస్తవాలు వెల్లడించాలని, అరుంబాక్కంకు చెందిన జోసెఫ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై ఇవాళ విచారణ జరిగింది.

జయలలిత మరణంపై మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమని అన్నాడీఎంకే నాయకురాలు సీఆర్ సరస్వతి అన్నారు. జయ మృతిపై అనుమానాలున్నాయని మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యలింగం వాఖ్యానించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వమే సమాచారం తీసుకుందని వెల్లడించారు. న్యాయస్థానం అవసరమనుకుంటే కేంద్రం నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని సూచించారు. శశికళ నాయకత్వ పటిమ గురించి జయలలితే పలుమార్లు చెప్పారని సరస్వతి గుర్తు చేశారు. చిన్నమ్మ.. అమ్మ ప్రతిరూపమని, ఆమె పార్టీని సమర్థవంతంగా నడపగలరని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles