కాక పుట్టిన పైలెట్.. కేంద్రమంత్రికి కేక పెట్టించే లేఖ.. Air India pilot gives it back to political class

Air india pilot takes on gajapathi raju writes something lagging even in mps

air india, air india pilot, ashok ganapathi raju, civil aviation minister, aviation minister, letter to aviation minister, air india pilot letter, india news

Air India pilot Majumdar wrote that Air India employees are also equally pained to observe that their politicians are “still lagging well behind in their commitment” to the nation when compared to most of their counterparts in many other countries.

కాక పుట్టిన పైలెట్.. కేంద్రమంత్రికి కేక పెట్టించే లేఖ..

Posted: 12/29/2016 04:05 PM IST
Air india pilot takes on gajapathi raju writes something lagging even in mps

మంత్రులం మనం చెప్పిందే వేదం.. మనం చేసేదే శాసనం అనుకోవడం అధికారంలో వున్న ప్రతీ నాయకుడు వ్యవహరించే తీరు ఇదే. ఓట్లేసిన ప్రజలు తమకు ఫలానా హామీ ఇచ్చారని దానిని నెరవేర్చాలి అని కోరినా.. పెద్దగా పట్టించుకునే నాధుడు వుండడు. ప్రతిపక్షంలో వుండగా అధికార పక్షాన్ని ప్రతీ అంశానికి నిందించే నేతలు.. అధికారంలోకి వస్తే మాత్రం ఏ చిన్న తప్పు దొర్లినా అందుకు అధికారులనే బాద్యుల్ని చేస్తారు. ఇక అధికారం చేతిలో వుందికదా అని అయినదానికి, కాని దానికి అధికారులను ఏకిపారేస్తుంటారు.

ఇలాంటి తరుణంలో సరిగ్గా ఒకరిద్దరు సర్ ఫిరా అధికారులుంటే మొత్తం సీన్ రివర్స్ అవుతుంది.. అదేంటి అంటారా.. తల తిరిగిన లేదా ముక్కు మీద కోపం వున్న అధికారులు వుంటే కేంద్రమంత్రులు కూడా అక్కడి నుంచి జారుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. వీళ్లు అందిరిలా కాదు.. తాము ఎందుకు ఒకరితో రాజీ పడాలి..? ఎందుకు అనవసరంగా మాటలు పడాలి అన్న మనస్తత్వం కలిగిన వారు. ఇలాంటి ఓ అధికారి కలిగించిన అనుభవం మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే టీడీపీ ఎంపీ, కేంద్ర విమాన‌యానశాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు ఎదురైంది.

ఎయిర్ ఇండియా పనితీరుపై ఆ సంస్థ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా, ఇతర విమానయాన సంస్థలతో పోల్చితే ఎయిర్ ఇండియా పనితనంలో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ సుభాషిష్ మజుందార్... అశోక్ కు ఓ ఘాటు లేఖ రాశారు. రాజకీయ నేతల్లో నిబద్ధత లోపిస్తోందని లేఖలో మజుందార్ ఆరోపించారు. లోక్ సభ, రాజ్యసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా, విలువైన సభా సమయాన్ని రాజకీయ నాయకులు వృథా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఒక్క లోక్ సభలోనే 92 గంటల సమయాన్ని వేస్ట్ చేశారని విమర్శించారు. సభా నియమాలను పాటించకుండా.... సభలో పోస్టర్లు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, విమర్శలు గుప్పించుకోవడంలాంటివి చేస్తున్నారని అన్నారు.ప్రపంచంలో ఇతర దేశాల నేతల నిబద్ధతతో పోల్చితే, మన దేశ నాయకులు చాలా వెనకబడ్డారని ఎయిరిండియా ఉద్యోగులు భావిస్తున్నారని విమర్శించారు. ఓ బాధ్యత గల ఉద్యోగిగా, నిజాయతీగా పన్ను చెల్లించే వ్యక్తిగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india  pilot  ashok ganapathi raju  civil aviation minister  letter  

Other Articles