జాగ్రత్తా సుమీ.. మీ స్మార్ట్ టీవీలు కూడా వైరస్ బారిన పడతాయ్..! LG smart TV Infected with Ransomware

Shocking ransomware is infecting smart tvs now

LG, google tv, LG Smart TV, virus, smart tv virus, lg tv virus, Google TV, lg smart tv virus, lg virus, Ransomware, Cyber.Police ransomware, FLocker, Frantic Locker, Dogspectus, Technology news

Be careful before downloading an app on your LG Smart TV. One user recently reported that their LG Smart TV had been infected by Cyber.Police ransomware.

జాగ్రత్తా సుమీ.. మీ స్మార్ట్ టీవీలు కూడా వైరస్ బారిన పడతాయ్..!

Posted: 12/29/2016 03:12 PM IST
Shocking ransomware is infecting smart tvs now

టెలీకమ్యూనికేషన్స్ రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవంతో టీవీలోనే కంప్యూటర్ ను అపరేట్ చేసేలా స్మార్ట్ టీవీలు అందుబాటులోకి రాగానే.. ఎందరెందరో వీటిలో సినిమాలు, గేమ్స్ డౌన్ లోడ్ చేసుకుని ఎంచక్కా వీక్షిస్తున్నారు. అయితే ఇలా చేయడం మొదటికే మోసం వచ్చే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు సాంకేతిక నిపుణులు. టీవీ, కంప్యూటర్లుగా వినియోగించుకునే స్మార్ట్ టీవీలలో కూడా వైరస్ సోకుతుందని అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.

ఇప్పటి వరకు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే వైరస్ సోకుతుందని భావిస్తుండగా, ఇక తాజాగా స్మార్ట్ టీవీలకు కూడా వైరస్ సోకుతుందన్న వార్తతో టీవీలు కొనుగోలు చేయాలంటూ హడలెత్తుతున్నారు ప్రజలు. వేల రూపాయలు ఖర్చు చేసి కొన్న స్మార్ట్ టీవీలు వైరస్ బారిన పడితే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్నెట్ కనెక్షన్ తో ఇటు టీవీతో పాటు అటు కంప్యూటర్ లా వినియోగించుకునే అవకాశం వుండటంతో వాటి వినియోగం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో వైరస్ సోకుతుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తోంది.
 
యూరప్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబానికి చెందిన ఎల్ జీ స్మార్ట్ టీవీకి వైరస్ సోకింది. ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసిన కుటుంబసభ్యులు సినిమా చూస్తుండగా మధ్యలో టీవీ ఆగిపోయింది. ఆ తర్వాత స్క్రీన్ పై వైరస్ సోకినట్లు చూపుతున్న ఓ ఫోటో తప్ప మరేమి రాలేదు. దీంతో సదరు ఇంజనీరు టీవీని రీసెట్ చేయడానికి యత్నించినా కుదరలేదు. దీంతో సంస్ధను సంప్రదించగా.. ఇంటికి వచ్చిన టెక్నీషియన్ రీసెట్ చేయడానికి రూ.23,170/-, సోకిన వైరస్ ను తొలగించడానికి రూ.11 వేలు ఖర్చవుతుందని చెప్పాడు.

అయితే ఇది గూగుల్ 2010లో తీసుకువచ్చిన పాత స్మార్ట్ టీవీలని.. వాటిని ఉత్పత్తిని గూగుల్ 2014లోనే నిలిపిసిందని, కానీ ఎల్జీ మాత్రం వాటిని ఇంకా ఉత్పాదన చేస్తుందని, ఆ టీవీలలో తాజాగా వస్తున్న స్మార్ట్ టీవీలలో వున్నట్లుగా వెబ్ ఓఎస్ కు బదులుగా అండ్రాయిడ్ ఓఎస్ వుంటుందని పలువురు అభిప్రాయపడుతుండగా, టీవీ యజమాని ఫ్రీ మూవీస్ నుంచి సినిమాను డౌన్ లోడ్ చేసకున్నారా..? అంటూ కోందరు.. మూవీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేశారా? లేదా వేరే సైట్ల నుంచి డౌన్ లోడ్ చేశారా? అని మరికోందరు ప్రశ్నలను సంధిస్తూ కామెంట్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LG  google tv  LG Smart TV  virus  Google TV  Ransomware  Technology news  

Other Articles