విప్లవపార్టీపై ఉద్యమపార్టీ చౌకబారు వ్యాఖ్యలా..! CPM member Sunnam Rajaiah condems CM KCR statements

Cpm member sunnam rajaiah condems cm kcr statements

CPM mla, badrachalam mla, Sunnam Rajaiah, sunnam rajaiah kcr, Telangana cm kcr, dot pin parties, cm kcr statements, telangana land acquisition bill, Telangana, political news

CPM member of legislative assembly Sunnam Rajaiah condems CM KCR words pointing out cheaply at their party and describing them as dot pin

విప్లవపార్టీపై ఉద్యమపార్టీ చౌకబారు వ్యాఖ్యలా..!

Posted: 12/29/2016 01:32 PM IST
Cpm member sunnam rajaiah condems cm kcr statements

ఒకటి ఉద్యమ పార్టీ.. మరోకటి విప్లవ పార్టీ. రెండు పార్టీలు తాము నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలన్న అకాంక్షతోనే ముందుకు సాగుతున్నాయి. ప్రజావసరాల మేరకు నిర్ణయాలను తీసుకుని వారి సంతృప్తే ధ్యేయంగా పయనిస్తున్నాయి. కానీ అధికారంలో వున్న ఉద్యమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఏకంగా విప్లవ పార్టీని అత్యంత చులకన చేసి మాట్లాడారని అరోపిస్తూ ఇవాళ విప్లవ పార్టీ నేత మండిపడ్డారు. పార్టీలను చులకన చేసి, ప్రజలను మాయచేసే చర్యలు మానుకోవాలని సూచించారు.

భూసేక‌ర‌ణ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌ల‌ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా క్రితంరోజున శాస‌న‌స‌భ‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త‌మ పార్టీపై చేసిన వ్యాఖ్యల‌ ప‌ట్ల సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈ రోజు అసెంబ్లీ ప్రాంగ‌ణంలో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ చాలా అసభ్యంగా, వ్యంగ్యంగా త‌మ పార్టీని గుండుసూది పార్టీ అనడంతో పాటు ప‌లు వ్యాఖ్యలు చేశార‌ని సున్నం రాజ‌య్య అన్నారు. శాస‌న‌స‌భ‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని చెప్పారు.

సీపీఎం పార్టీ దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడే పార్టీ అని ఆయ‌న అన్నారు. ప్రజ‌ల‌తో మాట్లాడి వారి క‌ష్టాల‌ను తెలుసుకునే పార్టీ అని చెప్పారు.కేసీఆర్ అటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్య విలువ‌ల‌ను అప‌హాస్యం చేశార‌ని రాజయ్య అన్నారు. ఈ విష‌యంపై తాము ఈ రోజు స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి లేఖ ఇచ్చామ‌ని చెప్పారు. నిన్న భూసేక‌ర‌ణ చ‌ట్టం స‌వ‌ర‌ణ‌ల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా తాము చేసిన సూచ‌న‌లను ప్రభుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న అన్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో ప్రభుత్వం స‌ర్వే చేప‌ట్టి రైతుల క‌ష్టాల‌ను తీర్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles