పాక్ క్రిస్మస్ వేడుకలో కల్తీ మద్యం.. విష ప్రయోగమా? | Christmas moonshine kills 31 in Pakistan town.

31 killed in pak christmas moonshine celebrations

Pakistan, toxic liquor, Pakistan Christmas Moonshine, Pakistan Christmas celebrations, Toba Tek Singh tragedy, Toba Tek Singh liquor death, Liquor or religion deaths, Christmas Pakistan, Mubarakabad pakistan

31 people die after consuming toxic liquor in Pakistan Christmas Moonshine Celebrations.

పాక్ క్రిస్మస్ వేడుకల్లో విష ప్రయోగం?

Posted: 12/28/2016 10:20 AM IST
31 killed in pak christmas moonshine celebrations

క్రిస్మస్ ముగింపు వేడుక అక్కడ తీవ్ర విషాదం నింపింది. కల్తీ మద్యం కాటేయటంతో 31 మంది దుర్మరణం పాలయ్యారు. పాకిస్థాన్ పంజాబ్ లోని తోబా టెక్ సింగ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టియన్ కమ్యూనిటికీ చెందిన కొందరు గ్రాండ్ గా సోమవారం సాయంత్రం ముగింపు పార్టీ ఇచ్చారు. ఇందులో సరఫరా చేసింది కల్తీ మధ్యం కావటంతో చాలా మంది తెల్లారేసరికి చనిపోయారు.

పలువురి పరిస్థితి విషమంగా మారటంతో మొహల్లామా ముబారకాబాద్ లోని ఆస్పత్రికి వారందరినీ తరలించారు. మంగళవారం సాయంత్రానికి చనిపోయిన వారి సంఖ్య 31గా తేలింది. సుమారు 100 మంది కల్తీ మధ్యం ప్రభావంకి గురికాగా, 31 మంది చనిపోయారని, మరో 64 మంది పరిస్థితి ఇప్పుడే చెప్పలేం అని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆస్పత్రికి తరలించేలోపే మరో 12 మంది చనిపోయినట్లు వాళ్ల బంధువులు చెబుతున్నారు. ఘటనకు కారకులైన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేసి పాకిస్థాన్ పీనల్ కోడ్ 322/337 జే ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం కల్తీ మద్యం సరఫరా చేసిన వ్యక్తి గతంలోఓసారి పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. కాగా, పాక్‌లో ముస్లింలకు మద్యం అమ్మకం, వినియోగాలపై నిషేధం ఉండగా, మైనారిటీలు, విదేశీయులకు పలు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. గత మార్చిలో హోలీ వేడుకల్లో భాగంగా కల్తీ మద్యాన్ని సేవించడంతో 45 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో 35 మంది హిందువులున్నారు. అయితే ఇతర మతాల వాళ్లే వరుసగా ఇలా కల్తీ కాటుకు బలవుతున్నారన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mubarakabad  Toxic Liquor deaths  Christmas Moonshine celebrations  

Other Articles