అరేళ్ల బాలుడ్ని బలిగొన్న సెల్ఫీ.. తల్లిదండ్రుల ఔదార్యం.. 6-year-old boy dies as Lalbagh pillar, bowl fall on him

Stone bowl kills boy in lalbagh parents donate his organs

ornamental stone pillar, Lalbagh, horticulture department, dance programme in school, stone bowl, vikram, bengaluru, selfie, selfie killed 6 yrs old boy, selfie craze, lalbagh botanical garden, srirampura, bangalore

A six-year-old boy was killed when an ornamental stone pillar and bowl fell on him when he and his cousin were taking a picture at Lalbagh

అరేళ్ల బాలుడ్ని బలిగొన్న సెల్ఫీ.. తల్లిదండ్రుల ఔదార్యం..

Posted: 12/27/2016 03:32 PM IST
Stone bowl kills boy in lalbagh parents donate his organs

ఇంటికి వచ్చిన అత్తా, వదినలతో పాటు సరదాగా పార్కుకు వెళ్లిన ఆ ఆరేళ్ల బాలుడికి అక్కడి దిగిన సెల్పీయే యమపాశమైంది. పార్కులోనికి వెళ్లి పదిహేను నిమిషాలు గడిచి గడవకముందే.. ఎన్నో సంతోషాలతో అడుగుపెట్టిన బాలుడు అనంతవాయువులలో కలసిపోయాడు. దీంతో అప్పటి వరకు పిల్లా, పాపలతో పాటు అనందంగా వున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అనుకోని ప్రమాదంలో బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో లాల్ బాగ్ బొటానికల్ పార్కు మరోమారు ఉలిక్కిపడింది.

శ్రీరామపురకు చెందిన కుమార్, రేవతి దంపతుల ఒక్కగానోక్క ఆరేళ్ల కుమారుడు విక్రమ్‌తో కలసి మధ్యాహ్నం 2.15 గంటలకు లాల్‌బాగ్‌ బొటానికల్ గార్డెన్ కు వెళ్లారు. నాలుగడుగుల పొడవైన నిలువెత్తు రాయి మీద బాబును కూర్చోబెట్టి సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా, రాయి కిందపడింది. దానిమీదున్న బాలుడు కూడా కిందపడ్డాడు. రాయి బలంగా తాకడంతో బాలుడు గట్టిగా కేకవేశాడు. దీంతో లాలాబాగ్ సిబ్బంది హుటాహుటిన స్థానిక అస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు.

కుమారుడు కళ్లముందే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. లాల్‌బాగ్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపించారు. సిద్ధాపుర పోలీసులు కేసు విచారణ చేపట్టారు. కాగా, 2015 ఆగస్టులో వైష్ణవి అనే విద్యార్థిని ఇదే పార్కులో తేనేటీగలు దాడిచేయడంతో చనిపోయినా అధికారులు మాత్రం పర్యాటకు ప్రాణాలను పణంగా పెడుతున్నారే తప్ప దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

అయితే తమ కుమారుడు అకస్మిక మరణంతో కుంగిపోయిన తల్లిదండ్రులు వారిలోని గోప్ప ఔదార్యాన్ని మాత్రం కనబర్చారు. తమ బిడ్డ అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. తమ బిడ్డ పార్కు అధికారుల నిర్వహణా లోపం కారణంగా పోయినా.. తన బిడ్డ అవయవాలతో వేరే బిడ్డలకు బతుకు లభిస్తుందంటే తాము సంతోషిస్తామని, వారిలో తమ బిడ్డను చూసుకుంటామని బాలుడి తల్లిదండ్రులు కుమార్, రేవతీలు చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles