జనవరి 3న శ్రీకాకుళంలో పర్యటించనున్న పవన్ Pawan Kalyan will visit srikakulam on Jan 3

Pawan kalyan will visit srikakulam on jan 3

pawan kalyan to srikakulam, pawan kalyan to ichchapuram, pawan kalyan to vizag, pawan kalyan politicsl trip, Manikanta theater, vizag novatel hotel, political news

Pawan Kalyan will visit Visakhapatnam on Jan 2nd. Pawan Kalyan fans and Jana Sena cadre are planning to accord grand welcome to him as he is coming to the city for the first time after 2014 elections.

జనవరి 3న పవన్ కల్యాన్ శ్రీకాకుళం పర్యటన

Posted: 12/27/2016 03:00 PM IST
Pawan kalyan will visit srikakulam on jan 3

ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కల్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కదులుతున్నారు. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంపై ఐదు అంశాలపై వరుసగా ఐదు రోజుల పాటు తీవ్రంగా విమర్శించిన ఆయన.. ఆ తరువాత పార్టీ బలోపేతం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 3న పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను జనసేన ప్రతినిధులు వెల్లడించారు. 2వ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పవన్ విశాఖ నగరానికి రానున్నారు. రాత్రి అక్కడే నోవాటెల్ హోటల్ లోనే బస చేయనున్నారు.

జనవరి 3న ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రెండు గంటల పాటు సాగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే భోజనం చేసి, సాయంత్రం 4 గంటల కెల్లా విశాఖ తిరిగొస్తారు. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలు, తన అభిమానులతో పవన్ సమావేశమవుతారని, తిరిగి 4వ తేదీన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి.

2014 ఎన్నికల తరువాత, విశాఖను హుద్దూద్ తుపాను ముంచెత్తిన తరుణంలో మాత్రమే వెళ్లిన పవన్ కల్యాన్.. ఆ తరువాత తొలిసారిగా విశాఖ నగరానికి చేరకుంటున్న క్రమంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలకాని అభిమానులు, పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. పవన్ రాక నేపథ్యంలో ఇప్పటి నుంచే ఘనంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అయితే విశాఖలో పవన్ కల్యాన్ కు పార్టీ నేతల బలాబలాల నిరూపణకు కూడా వేదిక కానుందన్న గుసగుసలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  seikakulam  ichchapuram  vizag  janasena  political news  

Other Articles