ఇంత తక్కువ టైంలో అమ్మ డీఎంకే పార్టీ ఎలా? | Iniyan Sampath launches Amma DMK

Iniyan sampath launches amma dmk

Amma DMK, Iniyan Sampath, former Chief Minister J Jayalalitha, Tamil Nadu new political party, Iniyan Sampath launches, Jayalalitha Iniyan Sampath, Amma dravida munnetra kazhagam, Political parties in Tamil Nadu after Jaya's demise

the Amma DMK. Launched by Iniyan Sampath. The new party intends to stick to the ideals shown by the former Chief Minister J Jayalalithaa.

అమ్మ డీఎంకే ఎలా పుట్టుకొచ్చిందంటే...

Posted: 12/26/2016 09:42 AM IST
Iniyan sampath launches amma dmk

పార్టీ, దాని విలువలకు కాకుండా వ్యక్తి పూజ రాజకీయాలే తమిళనాడును శాసిస్తుంటాయి. అమ్మయినా, చిన్నమ్మయినా స్వామి భక్తి, అతి వినయం ఒకేలా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అవతలి వ్యక్తి నియంతనా? అన్నంత ధోరణిని కలుగజేస్తాయి వారి వ్యవహార శైలి. ప్రస్తుతం ద్రవిడ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. జయలలిత చనిపోయాక అసంతృప్త వర్గాలు చెలరేగిపోతుంటే.. అనుయాయులు మాత్రం ఆమె గౌరవాన్ని బతికించాలంటూ విజ్నప్తులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ద్రవిడ ఇయక్కంలో కీలక నేతగా ఎదిగిన ఈవీకే సంపత్ తనయుడు ఇనియన్ కొత్త పార్టీని ప్రారంభించారు. టీఎన్ సీసీ మాజీ ప్రెసిడెంట్ ఎలన్ గోవన్ కి సోదరుడు అవుతాడు సంపత్. నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పాలనను వ్యతిరేకిస్తూ తమిళనాట స్థాపించబడిన తమిళ దేశీయ కట్చి(ఎస్) పార్టీ ని రద్దు చేసి మరీ ఈ జూన్ లో జయ సమక్షంలో అన్నాడీఎంకే లో చేరిన సంపత్ అమ్మ పేరిట కొత్త పార్టీని స్థాపించటం విశేషం. ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, పురుచ్ఛి తలైవి గౌరవం కాపాడేలా పార్టీని ముందుకు నడిపిస్తానని చెబుతన్నాడు.అమ్మ పేరిట చెండాలం

ఇక జయలలిత వర్గాన్ని ఆకర్షించేలా, అన్నా డీఎంకేను పోలిన విధంగా జెండాను తయారు చేసి, రెండాకుల చిహ్నం గుర్తు స్థానంలో జయలలిత రెండు వేళ్లతో చూపే విక్టరీ చిహ్నాన్ని ఉంచిన జెండాను ఇనియన్ తయారు చేయించుకున్నారు. ఇప్పుడీ కొత్త పార్టీ జెండా ఇనియన్ ఇంటిపై రెపరెపలాడుతోంది. అన్నా డీఎంకే పార్టీలో గందరగోళాన్ని సృష్టించేలా ఈ కొత్త పార్టీ పేరుందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఏఐఏడీఎంకే, డీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకే, ఏఐఎస్ఎంకే... ఇవన్నీ తమిళనాడులోని రాజకీయ పార్టీలు. వీటి పేర్ల మధ్య ఇప్పటికే ఎంతో కన్ఫ్యూజన్. ఇప్పుడీ కన్ఫ్యూజన్ ను మరింత పెంచేలా 'అమ్మ డీఎంకే' ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, జయ మేనకొడలు దీప అధ్యక్షతన జే అన్నాడీఎంకే పార్టీని త్వరలో స్థాపించబోతున్నట్లు అన్నాడీఎంకే కేసులను సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాది కృష్ణమూర్తి ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amma Dravida Munnetra Kazhagam  J Jayalalitha  Iniyan Sampath  

Other Articles