జయ పేరుతో జిరాక్స్ కొత్త పార్టీ | Jayalalitha niece Deepa new party.

New party on jayalalitha

Jayalalitha Death, J AIADMK, deepa jayakumar New Party, Advocate Krishnamurthy Jayalalitha, Jayalalitha's new Party, jayalalitha niece new party, Deepa Jayakumar Sasikala Natarajan, Sasikala Natarajan J AIADMK, Jayalalitha AIADMK new Party

Deepa Jayakumar and Krishnamurthy planned for New Party on name of Jayalalitha. J AIADMK party.

అమ్మ పేరుతో చెండాలమైన పనులు

Posted: 12/09/2016 04:43 PM IST
New party on jayalalitha

తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఓవైపు అమ్మ శవం మీదే నీచపు రాజకీయాలు నడిపిన పలువురు నేతలు, ఇప్పుడు ఏకంగా పార్టీ పగ్గాలనే చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతున్నారు. ఈ ప్రయత్నంలో ముందుండి జయ స్థానం భర్తీ చేసేందుకు శశికళ ప్రయత్నాలు మొదలుపెట్టిన వేళ నటి గౌతమి ఆరోపణలు తీవ్ర కలకలాన్నే రేపాయి. జయలలిత మృతిపై అనుమానాలున్నాయని, చికిత్స జరుగుతున్న వేళ సరైన నివేదికలను బయటపెట్టలేదని ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన అన్నాడీఎంకే వర్గాలు అదంతా పచ్చి అబద్ధం అంటూ ఆరోపణలను తోసిపుచ్చాయి. ఇక పార్టీ పగ్గాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ శశికళను అడ్డుకునేందుకు ‘జే అన్నాడీఎంకే’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

అన్నాడీఎంకే కేసులను సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాది కృష్ణమూర్తి ప్రకటించినట్లుగా ఒక ఆడియో తమిళనాడులో హల్‌చల్‌ చేస్తోంది. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకేను తమ చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు శశికళ, సీఎం పన్నీర్‌సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, మంత్రి ఎడపాడి పళనిస్వామి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మకు వీరాభిమాని అయిన సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి పేరున సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో విడుదలైంది. అందులో... పార్టీలో శశికళ పెత్తనానికి నిరసనగా ’జే అన్నాడీఎంకే’ అనే పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇక జయలలితకు నిజమైన వారసురాలిగా పేర్కొంటూ ఆమె మేనకోడలు(జయలలిత అన్న కూతురు) దీప జయరాంను అధ్యక్షురాలిగా నియమిస్తానని ఆయన అందులో పేర్కొన్నాడు. ఈ ఆడియోపై శశికళ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే తో సంబంధాలు తెంచేసుకోవాలంటూ కృష్ణమూర్తిపై బెదిరింపులకు దిగారంట. ఈ మేరకు కూడా ఆడియో ఒకటి నెట్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే తానే నిజమైన వారసురాలిని అని చెప్పుకుంటున్న జయ జిరాక్స్ దీప తాను బరిలోకి  ఎవరెన్ని ఆటంకాలు కలిగించిన తాను రంగంలోకి దిగి తీరుతానని ఇది వరకే ప్రకటించింది. మరోవైపు అమ్మ పేరుతో ఇాలాంటి నీచపు రాజకీయాలు చేయకండని పలువురు పొలిటికల్ పండితులు వారికి సలహాలు ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles