ఫేక్ న్యూస్ రియాక్షన్.. పాక్ మంత్రిని పిచ్చి బూతులు తిడుతున్నారు | Pak Defence Minister Fake news reaction.

Minister reads fake news and threatens

Pakistan Defence Minister, Khawaja Muhammad Asif, Fake News, Israel Nuclear strikes, Khawaja Muhammad Asif twitter, Minister Reads Fake News, Pakistan Fake News, Israel Ex minister Pak defence minister

Pakistan Defence Minister Khawaja Muhammad Asif reads Fake News published in awdnews.com and Threatens Israel With Nuke Strike.

ఆ మంత్రికి తాజాకు, మాజీకి తేడా తెలీదా?

Posted: 12/26/2016 09:07 AM IST
Minister reads fake news and threatens

ఓ వార్త సరైందో కాదో తెలీకుండా అనవసరమైన వివాదాలు రేగటం చాలా సార్లు చూశాం. కానీ, అత్యున్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి దానిపై సూక్ష్మ పరిశీలన చేయకుండా కామెంట్లు చేసి విమర్శల పాలయ్యాడు అది ఎవరో కాదు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మ‌హమ్ముద్ ఆసిఫ్. దీనికి కారణం ఓ సైట్ ప్రచురించిన ఫేక్ న్యూస్...

ఏడబ్యూడీ.కామ్ అనే వెబ్‌సైట్‌లో రాసిన త‌ప్పుడు వార్త‌ను చ‌దివిన ఖ్వాజా ఇజ్రాయిల్‌ను హెచ్చ‌రించ‌డంతో క‌ల‌క‌లం రేగింది. పాకిస్థాన్ క‌నుక సిరియాకు త‌మ ఆర్మీ ద‌ళాల‌ను పంపిస్తే, తాము అణ్వాయుధాల‌తో పాక్‌ను స‌ర్వ‌నాశ‌నం చేస్తామ‌ని ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ‌శాఖా మంత్రి హెచ్చరించినట్టు కొన్ని రోజుల క్రితం అవాద్ న్యూస్ డాట్‌కామ్ ప్రచురించింది. ఈ వార్త‌లో ర‌క్ష‌ణ మంత్రి అంటూ పొరపాటున పేర్కొంది. నిజానికి కామెంట్లు చేసింది మాజీ మంత్రి.

ఈ విష‌యాన్ని పాక్ ర‌క్ష‌ణ మంత్రి కూడా గుర్తించ‌లేక‌పోయారు. దీంతో ఇజ్రాయిల్ తీరుపై మండిప‌డిన మంత్రి ఆసిఫ్ త‌మ‌ది కూడా అణ్వాయుధ దేశ‌మేన‌న్న సంగ‌తిని ఇజ్రాయిల్ గుర్తుంచుకుంటే మంచిదంటూ శ‌నివారం ట్వీట్ చేశారు. దీంతో పాక్ మంత్రి తీరును దుయ్య‌బ‌డుతూ 400 మంది రీట్వీట్ చేశారు. వెబ్‌సైట్ రాసింది త‌ప్పుడు వార్త అని ఇజ్రాయిల్ ఖండించినా ఆసిఫ్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan Defence Minister  Khawaja Muhammad Asif  fake news  Warn Israel  

Other Articles