పెద్దనోట్ల రద్దే.. ఆయనపై కాల్పులకు దారితీసింది..! demonetisation leads for attack on bank CEO in Hyderabad

Demonetisation leads for attack on bank ceo in hyderabad

KBS bank, Hyderabad, Bank CEO shot in Hyderabad, Masab Tank, gunfire, unidentified man shoots CEO, Manmath Dalai, Bank CEO, manmadha dalai, masab tank, driver, rajamundry youth, crime news

Police Commissioner Mahender Reddy announced the breakthrough in the case relating the December 18 attack on Manmath Dalai, CEO of KBS Local Area Bank.

పెద్దనోట్ల రద్దే.. ఆయనపై కాల్పులకు దారితీసింది..!

Posted: 12/26/2016 08:28 AM IST
Demonetisation leads for attack on bank ceo in hyderabad

హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో కేబీఎస్ బ్యాంకు సీఈఓ మన్మథ్ దలైపై జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముగ్గురు యువకులు కలసి బ్యాంక్ సిఈఓపై కాల్పులకు స్కెచ్ వేశారని, అయితే వీరికి బ్యాంకు సీఈఓ డ్రైవర్ ఇంటి గుట్టు తెలిపాడని వెల్లడించారు. నిందితులందరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారేనన్నారు.

నరేష్, షేక్ అబ్దుల్ రహీమ్, రాజేందర్, వెంకటరత్నంలను నిందితులుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి ముగ్గురు యువకులను అరెస్టు చేశామని, మరోకరి కోసం గాలింపు చేపట్టామని చెప్పారు. ఈ నెల 18న మన్మథ్ దలైపై  దోపిడీకి యత్నించిన దుండగుడు రెండు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డాడని మహేందర్ రెడ్డి తెలిపారు. బ్యాంకు సీఈఓ నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపింది షేక్ అబ్దుల్ రహీమ్ గా పోలీసులు తెలిపారు.

నిందితుల నుంచి దేశవాళీ తుపాకీతో పాటు 12 బుల్లెట్లు, ఒక మోటార్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మహేందర్ రెడ్డి చెప్పారు. కాగా నరేష్ సోదరుడు శ్రీహరి దలాయ్ కారు డ్రైవర్ అని, అయితే అతనికి తెలియకుండానే వాళ్లు అతని నుంచి సమాచారం రాబట్టారని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. పెద్ద నోట్ల విషయంలో బ్యాంకు మేనేజర్ల పాత్రపై చర్చించికున్న వీరు అప్పటికప్పుడు ప్రణాళికను వేసుకుని దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KBS bank  Hyderabad  Bank CEO  Manmath Dalai  hyderabad police  driver  crime news  

Other Articles

Today on Telugu Wishesh