బాయ్ ఫ్రెండ్ కోసం మరీ ఇంతకు తెగించిన ప్రియురాలు girlfriend turns as thief for the sake of lover

Girlfriend turns as thief for the sake of lover

yeshwanth naidu, sai kiranmayi, thief, malakpet, gym instuctor, hyderabad police, face book friends, debts, girl friend, boy friend, lover, crime news

G Sai kiranmayi turned as thief and robbed gold and other cosly items from her facebook friends house, to make her boyfreind out from debts

బాయ్ ఫ్రెండ్ కోసం మరీ ఇంతకు తెగించిన ప్రియురాలు

Posted: 12/26/2016 07:44 AM IST
Girlfriend turns as thief for the sake of lover

ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు అంటూ పాతళ భైరవి చిత్రంలో ప్రేమికుడి గురించి అతని ప్రేమ గురించి మన తెలుగు సినీ కవులు బాగానే చెప్పారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నది మాత్రం అచ్చం అలాంటిదే.. కాకపోతే అబ్బాయి ప్రేమ గాధకు బదులు అమ్మాయికి ప్రేమ తెచ్చిన కష్టం ఎలాంటిదో తెలిసిపోతుంది. అదెలా అంటారా.. ప్రేమ కోసం ఏం చేసినా.. ఎలా చేసినా పర్వాలేదన్న నానుడిని బాగా వంటపట్టించుకున్న ఓ ప్రియురాలు.. ఏకంగా అతన్ని కష్టాల వలయం నుంచి దాటించేందుకు దొంగగా మారింది. దోంగతనాల బాట పట్టింది. అయితే అమ్మాయి అంటున్నారు అంటే ఈ ప్రియురాలికి ఇంకా 19 ఏళ్లే మరి.

వివరాల్లోకి వెళితే, మలక్ పేటలో ఉంటున్న జి.సాయి కిరణ్మయి అనే యువతి, జిమ్ ఇనస్ట్రక్టర్ గా ఉన్న యశ్వంత్ నాయుడు అనే యువకుడిని ప్రేమించింది. అతనికి డబ్బులు అవసరమని తెలుసుకుని, మాస్టర్ ప్లాన్ వేసింది. తన ప్రియుడ్ని కష్టాల నుంచి గట్టేక్కించడం కోసం తను స్నేహం అన్న పేరుకు మాయని మచ్చ తీసుకువచ్చింది. అదెలా అంటే. దొంగతనాల మార్గాన్ని ఎంచుకునే క్రమంలో ఫేస్ బుక్ లో తన పేరిట ఖాతాను తెరిచి, పలువురు మహిళలతో స్నేహం కుదుర్చుకుంది.

వాళ్లింటికి వెళ్తూ, వస్తూ మంచి స్నేహితురాలిగా ఉండేది. వాళ్లతో కలివిడిగా తిరుగుతూ, అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లింట్లోని బంగారు ఆభరణాలు, నగదు దొంగతనం చేస్తుండేది. గత నెలలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన ఆమె, 15 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించింది. బాధితుల ఫిర్యాదు మేరకు, కిరణ్మయిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే, అసలు విషయం వెల్లడైంది. ఆమెతో పాటు యశ్వంత్ నూ అరెస్ట్ చేశామని, కోర్టు ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles