బ్యాంకు సీఈఓ కాల్పుల ఘటనలో ఇంటిదోంగే కీలకం.. kbs bank ceo case, teluguwishesh doubts come true

Kbs bank ceo case teluguwishesh doubts come true

KBS bank, Hyderabad, Bank CEO shot in Hyderabad, Masab Tank, gunfire, unidentified man shoots CEO, Manmath Dalai, Bank CEO, manmadha dalai, masab tank, driver, rajamundry youth, crime news

Manmath Dalai, KBS bank ceo, shooting case telugu wishesh doubts come true. he was fired with tip given by his driver to rajamundry boys, who posing as a policeman entered his apartment

బ్యాంకు సీఈఓ కాల్పుల ఘటనలో ఇంటిదోంగే కీలకం..

Posted: 12/24/2016 03:20 PM IST
Kbs bank ceo case teluguwishesh doubts come true

హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో ఈ నెల 11న జరిగిన కాల్పుల ఘటనలో తెలుగు విశేష్ వ్యక్తపర్చిన అనుమానాలు నిజమయ్యాయి. ఇంటి దోంగ ప్రమేయం లేనిదే.. ఈ కాల్పులు ఘటన జరగదని అనుమానాలను వ్యక్తం చేయడం.. సరిగ్గా అలానే జరిగింది. ఈ కాల్పుల ఘటనలో ఇంటి దోంగ ప్రమేయముందని పోలీసులు కూడా తేల్చారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు బ్యాంకు సిఈఓ మన్మథ దలాయ్  ఇంట్లోకి వెళ్లిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారని పోలీసుల దర్యాప్తులో కూడా వెల్లడైంది.

ఈ నెల 12న కేబీఎస్ బ్యాంకు సీఈఓపై కాల్పులు.. తెలిసిన వ్యక్తుల పనేనా..? అనే శీర్షికన మేమిచ్చిన వార్తకథనంలోని లీడ్.. ‘‘హైదరాబాద్‌లో మరోమారు రేగిన కాల్పులు కలకలం పలు అనుమానాలకు తావిస్తుంది. బ్యాంకు గురించి సమస్త సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి దుండగుడిని ఉపిగోల్పివుంటారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. దుండగుడు నేరుగా మాసాబ్ ట్యాంక్ లోని మన్మథ్ దలై నివాసముంటున్న అపార్టుమంటుకు చేరుకోవడం.. సరిగ్గా ఆయన నడిపే కారును చూపించి.. ఆయన ప్లాట్ లోకి వెళ్లాలని కోరడం అంతా పరిశీలించిన పక్షంలో దుండగుడు పలుమార్లు అయనను అడ్డుకునేందుకు ప్లాట్ లో కాకుండా బయట కూడా రెక్కీ నిర్వహించినట్లే వున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేనును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు బ్యాంకు సిబ్బంది సహా, సీఈఓ పరిచయస్తులపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.’’

తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా మన్మథ్ దలాయ్ డ్రైవర్ ప్రమేయముందని తేల్చారు. ఈ కేసులో పురోగతిని సాధించిన పోలీసులు బ్యాంకు సీఈఓపై కాల్పులు జరిపింది రాజమండ్రికి చెందిన యువకులనేనని గుర్తించారు,  బ్యాంకు సీఈవో వద్ద డబ్బులుంటాయని భావించి వారు దోపిడీ యత్నం చేశారు. బ్యాంకు సీఈవో డ్రైవర్ సాయంతో ఆ యువకులు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. బ్యాంకు సీఈఓ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతోనే రాజమండ్రికి చెందిన యువకులు కాల్పులకు తెగబడినట్లు తేల్చారు. కాగా,  సీఈవోపై కాల్పులు జరిపిన యువకులు  ప్రస్తుతం  పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh