క్షుద్ర పూజలను చూపించే సినీమాలు, టీవీ సిరియళ్లపై నిషేధం.. indian government to ammend law of black magic and tactics

Indian government to ammend law of black magic and tactics

black magic, tactics, tv serials, movies, promote, ban on tv serials, ban on movies, union government to ammend lawa, black magic laws, india news, latest news

indian government to ammend law of black magic and tactics, writes letters to state government to educate laws in remorse villages. centre planning to ban tv serials and movies which promote the same.

వాటిని చూపించే సినీమాలు, టీవీ సిరియళ్లపై నిషేధం..

Posted: 12/24/2016 12:38 PM IST
Indian government to ammend law of black magic and tactics

శాస్త్రపాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ ముందుకు దూసుకువెళ్తున్న క్రమంలో ఇంకా దేశంలోని పలు ప్రాంతాల్లో మూడనమ్మకాలు రాజ్యమేలడంపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. మూడనమ్మకాల నేపథ్యంలో తోటి గ్రామస్థులపై దాడులు చేయడం, వంటి అనాగరిక చర్యలకు పాల్పడటంపై తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. అంతేకాదు క్షు‌ద్ర‌పూజ‌లను వదిలిస్తామని, మాయమాటలు చెప్పి ప్ర‌జ‌ల్ని మోసం చేసేవారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

దీంతో పాటు ఇకపై క్షద్రపూజలను చూపించడంతో పాటు వాటిని ప్రోత్సహించే విధంగా వున్న టీవీ సిరయళ్లను, చిత్రాలపై నిషేదాన్ని విధించేందుకు రెడీ అవుతుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో అనేక మూడాచారాలు, మూడనమ్మకాలు రాజ్యమేలగా గత అరవై ఏళ్లుగా ఎన్నింటినో పారద్రోలగా.. భాణామతి, చేతబడి వంటి వాటిని ప్రోత్సహించే వారు అధికం కావడంతో.. ఇవి ఇంకా మారుమూల గ్రామాల్లో కనిపిస్తున్నాయి. దీంతో వీటిని కూడా సమూలంగా అంతం చేయడానికి కేంద్రం నూతనంగా ఓ చ‌ట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.

నూతనంగా రూపుదిద్దుకోనున్న ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌స్తే చేత‌బ‌డి, బాణామ‌తి అంటూ ప్ర‌జ‌ల్ని మోసం చేసే వారి ప‌ని అయిపోయిన‌ట్టే. ఈ మేర‌కు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ‌లు రాసిన కేంద్రం క్షుద్ర‌పూజ‌ల‌ను అరిక‌ట్టేందుకు ఆయా రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉన్న చ‌ట్టాల గురించి తెల‌పాల‌ని కోరింది. ప్ర‌జ‌ల్లో అంత‌ర్లీనంగా ఉన్న న‌మ్మ‌కాన్ని సొమ్ము చేసుకుంటున్న కొంద‌రు క్షుద్ర‌పూజ‌ల పేరుతో వారిని దోచుకుంటున్నారు. మ‌రోవైపు సాంకేతికంగా దేశం పురోగ‌తి సాగిస్తున్నా ఇంకా  చాలా రాష్ట్రాల్లో చేత‌బ‌డుల పేరుతో హింస కొన‌సాగుతూనే ఉంది.

ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన సంఘ‌ట‌న ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. చేతబ‌డుల నెపంతో ఓ అమాయ‌కుడిని చెట్టుకు క‌ట్టి కొట్టి చంపేశారు. క్షుద్ర‌పూజ‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం, స్వ‌చ్ఛంద సంస్థ‌లు పలు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నా ప‌రిస్థితుల్లో మార్పు క‌నిపించ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం తీసుకొచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. క్షుద్ర పూజ‌లతో మోస‌పోయిన త‌ర్వాత బాధితుల పిర్యాదుతో కేసులు న‌మోదు చేయ‌డం కాకుండా, క్షుద్ర‌పూజ‌లు చేసే వారి స‌మాచారం తెలియ‌గానే కేసు పెట్టేందుకు యోచిస్తోంది. అలాగే కొత్త చ‌ట్టంలో టీవీ సీరియ‌ళ్లు, సినిమాల్లోనూ క్షుద్ర‌పూజ‌ల‌ను ప్రేరేపించే దృశ్యాల‌పై నిషేధం విధించే అవ‌కాశం ఉన్న‌ట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles