తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావుకు గుండెపోటు.. After Chennai IT Raid, Ex-Chief Secy Ram Mohan Rao in ICU

After chennai it raid ex chief secy ram mohan rao in icu

Chennai IT raid, tamilnadu ex chief secretary, rammohana rao, demonitization of notes, Rama chandra hospital, ICU, Heart attack

Former Tamil Nadu Chief Secretary Ram Mohan Rao - who was sacked following I-T raids at his residence in disproportionate asset case - was taken to ICU at Chennai's SRMC Hospital

తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావుకు గుండెపోటు..

Posted: 12/24/2016 11:48 AM IST
After chennai it raid ex chief secy ram mohan rao in icu

అక్రమాలు వెలుగు చూడటం.. ఆదాయానికి మించి అస్తులు వుండటం.. సీనియర్లను పక్కన బెట్టి సీఎస్ పదవిని దక్కించుకున్న అరోపణలు రావడం.. అంతలలోనే తనను ఉన్నత పదవి నుంచి తప్పించడం.. అది చాలదన్నట్లు పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న భయాందోళన కూడా తొడవ్వడంతో తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాతిలో నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని రామచంద్ర అస్పత్రికి తరలించారు. వైద్యలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అయనకు అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రామ్మోహన్ రావు బందువులకు గుండెపోటు వ‌చ్చిందని వైద్యులు కన్ఫాఫ్ చేసి చెప్పారు.

ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులను కూడబెట్టారన్న అరోఫణలతో పాటు అక్రమంగా కొత్త కరెన్సీ కలిగి వుండటంతో ఇటీవ‌లే ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు రామ్మోహ‌న్‌రావు ఇంటితో పాటు ఆయ‌న బంధువుల ఇళ్ల‌లోనూ దాడులు నిర్వ‌హించి కోట్ల రూపాయ‌ల న‌గ‌దు, భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుంచి 154 కోట్ల రూపాయలను, 167 కిలోల బంగారాన్ని కూడా అదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెహల్కా తెలిపింది. కాగా 154 కోట్లలో 38 కోట్ల రూపాయలు కొత్త రెండు వేల రూపాయల నోట్లేనని కూడా తెలిపింది. ఈ నేప‌థ్యంలోనే ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌ అస్వస్థతకు గురయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ చెన్నయ్‌లోని పోరూరు రామచంద్ర ఆసుపత్రిలో అత్యవసరవార్డులో చికిత్స పొందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles