సినిమా షూటింగ్ చేయబోతే... రియల్ హైజాక్ అయ్యింది.. | Hijacking interrupts film crew shooting fake plane hijacking.

Hijacking ends peacefully after libyan airliner lands in malta

Libyan plane hijack, plane hijack, Malta plane hijack, Malta hijackers surrender, Libyan Airline hijack, replicas guns hijackers, plane hijack drama

Libyan plane hijack ends peacefully at Malta, hijackers surrender.

డమ్మీ గన్ లతో హైజాక్ డ్రామా చేశారు

Posted: 12/24/2016 08:26 AM IST
Hijacking ends peacefully after libyan airliner lands in malta

లిబియాకి చెందిన ఆఫ్రీకియా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ఏ-320 విమానం హైజాక్ కథ సుఖాంతం అయింది. సెభా నుంచి ట్రిపోలికి 118 మందితో వెళ్తుండగా ఈ విమానాన్ని ఇద్దరు దుండగులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాన్ని మాల్టా దీవిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం భద్రతా దళాలు విమానాశ్రయాన్ని చుట్టుముట్టగా, విమానాశ్రయానికి రాకపోకలు నిలిపేశారు.

వెంటనే మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్, లిబియా ప్రధాని ఫయీజ్ అల్ సెర్రాజ్‌ తో మాట్లాడారు. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి వైమానిక, భద్రత ఇతర ఉన్నతాధికారులు ఫోన్ల ద్వారా హైజాకర్లతో చర్చించారు. ఈ క్రమంలో తొలుత ఒక శిశువు, 28 మంది మహిళలను వదిలిపెట్టిన హైజాకర్లు, తరువాత సిబ్బందిని మాత్రమే బందీలుగా ఉంచుకుని ప్రయాణికులందర్నీ విడిచిపెట్టారు. అనంతరం చర్చల్లో పురోగతి సాధించడంతో వారిని కూడా విడిచిపెట్టి భద్రతా దళాలకు లొంగిపోయారు. దీంతో కథ సుఖాంతమైంది.

ఇక తాజా పరిణామాల నేపథ్యంలో మాల్టా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని విమానాలను రద్దుచేసి, మరికొన్నింటిని దారి మళ్లించారు. మరో 24 గంటల్లో సర్వీసులను పునరుద్ధికరీస్తామని అధికారులు తెలిపారు. కాగా, అదే సమయంలో ఓ సినిమాకు సంబంధించిన హైజాక్ షూటింగ్ జరగాల్సి ఉండగా, ఈ రియల్ సంఘటనతో వాళ్లు వణికిపోయారు. 1976 జరిగిన ఇజ్రాయిల్ దళాలు 150 బందీలను విడిపించేందుకు చేసిన ఆపరేషన్ నేపథ్యంలో ఆ చిత్రం తెరకెక్కించేందుకు ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ చేయాల్సి ఉందని యూనిట్ చెబుతోంది.

ఇక హైజాకింగ్ కు కారణాలు తెలియరాకపోయినా, వారి దగ్గరి ఉన్న ఆయుధాలు మాత్రం డమ్మీ వని తేలి భద్రతా సిబ్బంది నిర్ఘాంతపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Libyan plane hijack  Malta airport  hijackers surrender  

Other Articles