బెల్లం రంగు చూసి తింటే చావు ఖాయం | Colour Jaggery most dangerous.

Jaggery poisned with chemicals

Jaggery Poison, Jaggery Dangerous, Jaggery Anakapalle, Anakapalle Farmers, Anakapalle Bellam, Anakapalli Bellam, Bellam Poison, Jaggery Poison, Poison Jaggery, Hydran Jaggery

Aakapalli Farmers admits that they ad chemicals into Jaggery.

ఆ బెల్లంతో యమ డేంజర్ గురూ!

Posted: 12/24/2016 08:56 AM IST
Jaggery poisned with chemicals

బెల్లం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం, షుగర్ కంటే ఎక్కువ మేలు చేసే ఈ సహజకారకంతో ఆరోగ్యం కూడా లభిస్తుందని వైద్యులు చెబుతుండటం తరచూ చూస్తాం.
అయితే బెల్లాన్ని ఎక్కువ‌గా వినియోగించే వారికి ఓ వార్త భయం కలిగిస్తోంది. మంచి రంగులో కనిపిస్తుంది కదా అని బెల్లం ను కొనుగోలు చేస్తే మీ పని అంతే. బెల్లం తయారీలో హానికార‌క ర‌సాయ‌నాలు వాడుతున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

బెల్లం తయారు చేసే స‌మ‌యంలో హైడ్రాన్‌(స‌ల్ఫ‌ర్‌), సోడియం కార్బొనేట్‌, సూప‌ర్ ఫాస్ఫేట్ విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగిస్తున్న‌ట్టు అన‌కాప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా సంస్థ శాస్త్ర‌వేత్త‌లు నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. నిజానికి బెల్లం రంగు అనేది అక్క‌డి నేల స్వ‌భావం, సేంద్రియ‌, ర‌సాయ‌న ఎరువుల వాడ‌కాన్ని బ‌ట్టి ఉంటుంది. అయితే బెల్లం రంగు బాగా ఆక‌ర్షణీయంగా ఉండాల‌నే ఉద్దేశంతో య‌థేచ్ఛ‌గా ర‌సాయ‌నాల‌ను వాడేస్తున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అక్కడి రైతులే అంగీక‌రించ‌డం గ‌మ‌నార్హం.

అంత డేంజరా?
హైడ్రాన్ క‌లిసిన బెల్లం తిన‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో నాడీ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆస్థమా, జీర్ణ సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వారంటున్నారు. అంతేకాదు బాడీలో పాస్పరస్ (గంధ‌కం) శాతం పేరుకుపోతుంద‌ని పేర్కొన్నారు. నిజానికి బెల్లంలో 70 పీపీఎం కంటే ఎక్కువ గంధ‌కం ఉండ‌కూడ‌దు. అయితే ఇది ప్ర‌స్తుతం ల‌భిస్తున్న బెల్లంలో 150 పీపీఎం నుంచి 500 పీపీఎం.. అంటే ఉండాల్సిన స్థాయి కంటే ఐదారు రెట్లు ఎక్కువ ఉన్న‌ట్టు తేలింది. కాబట్టి ఇప్పటి నుంచి బెల్లం రుచి చూసే జర భద్రంగా ఉండండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anakapalle  Jaggery  Hydran Poison  

Other Articles