ఎట్టెట్టా..! పరదేశీ వద్ద మన కొత్త కరెన్సీ.. లక్షల్లో.. Nigerian man detained at Delhi airport

Nigerian man carrying rs 53 lakh in new notes detained at delhi airport

New notes, Nigerian man, Delhi Airport, Cash seized, I-T officials, demonetisation, Rs 53.78 lakh, foreign national, Indira Gandhi International airport, Delhi

A Nigerian national travelling to Coimbatore was detained at the Delhi airport, when he was found carrying a large stash of old and new currency notes.

ఎట్టెట్టా..! పరదేశీ వద్ద మన కొత్త కరెన్సీ.. లక్షల్లో..

Posted: 12/23/2016 10:12 PM IST
Nigerian man carrying rs 53 lakh in new notes detained at delhi airport

పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులకు వెయ్యి, రెండువేలు రూపాయల కొత్త నోట్లు దొరకడమే గగనంగా మారగా.. మరోవైపు అక్రమార్కుల వద్ద వందల కోట్లలో కొత్త కరెన్సీ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య దేశంలోని అక్రమంగా చోరబడ్డ ఉగ్రవాది వద్ద కూడా కొత్త రెండు వేల రూపాయల నోట్లు బయటపడ్డాయి. తాజాగా ఓ విదేశీయుడి వద్ద కూడా లక్షల రూపాయల్లో కొత్తనోట్లు దొరికాయి. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీమొత్తంలో కొత్త కరెన్సీతో ప్రయాణిస్తున్న విదేశీయుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నైజీరియా దేశస్తుడైన తుచుక్వో చిజియోకో అనే వ్యక్తి వద్ద 53.78 లక్షల కొత్త కరెన్సీని, రూ. 4.29 లక్షల పాత కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఇండిగో విమానంలో అతడు వచ్చాడు. భారీ మొత్తంలో కరెన్సీ దొరకడంతో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో కొత్త కరెన్సీ, పాత కరెన్సీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles