పరాయిదేశంలో పడతిపై ఎన్ఆర్ఐ అసభ్య ప్రవర్తన case booked against indian in US, after groping her in flight

New jersey man wrote apology note to women after groping her on flight

Ganesh Parkar, Newark, Sexual assault, sexual assault on plane, sexual assault on women, United States, New York, flight, indian man, woman groped

A New Jersey man groped a woman during a transcontinental flight and then apologised in a pair of notes in which he acknowledged his actions were "stupid," U.S. authorities said.

పరాయిదేశంలో పడతిపై ఎన్ఆర్ఐ అసభ్య ప్రవర్తన

Posted: 12/23/2016 03:57 PM IST
New jersey man wrote apology note to women after groping her on flight

పరాయి దేశంలో వుంటున్నామన్న సంగతి కూడా మర్చి.. పడుకున్న పడతిపై అసభ్యంగా ప్రవర్తించి.. ఆనక సారీ అంటూ చెప్పశాడో భారతీయుడు. అమెరికాలో నివసిస్తున్న ఓ ఎన్ఆర్ఐ తాను చేసిన పనికి సిగ్గుపడుతూనే చివరకు తాను చేసిన పనికి చింతిస్తున్నాడు. పర స్త్రీని లక్ష్మీ దేవిగా భావించే పుణ్యమైన భారతదేశంలో జన్మించి.. పాశ్యాత దేశాలు వెళ్లి అక్కడి సంస్కృతిని వంటబట్టించుకుని ఇలాంటి దురాగాతాలకు పాల్పడ్డాడు.

ముంబై నుంచి న్యూజెర్సీలోని నెవార్క్‌ వెళుతున్న ఎయిరిండియా విమానంలో గణేశ్ పార్కర్ అనే ఎన్ ఆర్ ఐ తన తోడి మహిళా ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడి ప్రస్తుతం కేసులలో ఇరుక్కుని కటకటలాపాలవుతున్నాడు. అంతా అయ్యాక ఇతగాడికి జ్ఞానోదయం అయ్యింది కాబోలు ఇక చేసేది లేక తాను చేసిన పనికి చింతిసత్ున్నట్లు పేర్కోంటూ తన తోటి ప్రయాణికురాలికి రెండు పర్యాయాలు ఉత్తరాలు రాశాడు.

తనను లైంగికంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఎయిర్‌పోర్టు అధికారులు పార్కర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అతను నెవార్క్‌ ఫెడరల్‌ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఎయిరిండియా విమానంలో తనది బిజినెస్‌ క్లాస్‌ సీటు అయినప్పటికీ పార్కర్‌ ఎకానమీ క్లాస్‌లో ఓ మహిళ పక్కన ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్నాడు. అంతే సభ్యతా సంస్కారం మరచి అమెను కామవాంఛతో చూశాడు. నిద్రపోతున్న మహిళ తన బ్లాంకెట్‌ను ఎవరో తొలగించినట్టు అనిపిస్తే లేచి చూసింది. కానీ ఏమీ తెలియనట్టుగా నిద్రపోతున్నట్లుగా పార్కర్ నటించాడు.

దీంతో మళ్లీ అమె నిద్రలోకి జారుకోగా.. పార్కర్‌ ఆమె చొక్కాలోకి చెయ్యిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్‌ తిన్న అమె.. ’మీరు ఏం చెస్తున్నారని కేకలు వేసింది’ని దీంతో రంగంలోకి దిగిన విమాన సిబ్బంది పార్కర్ ను తనకు కేటాయించిన బిజినెస్ క్లాస్ సీటు వద్దకు పంపించి వేశారని విమానంలో జరిగిన ఘటనను బాధితురాలి పేర్కోన్న పిర్యాదులో వున్న విధానాన్ని అని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. అయితే, తాను మూర్ఖమైన చర్యకు పాల్పడ్డానని పార్కర్‌ అంగీకరిస్తూ.. క్షమాపణ నోటు రాసి పెట్టారని వారు వివరించారు. 50వేల డాలర్ల పూచీకత్తు మీద పార్కర్‌ జైలు నుంచి విడుదలైనా.. కొంతకాలంపాటు హౌస్‌ అరెస్టులో ఉండాలని కోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh Parkar  Newark  New York  flight  indian man  sexual assault  United States  

Other Articles