అక్రమ రవాణా.. ఆపై నీలి చిత్రాలు, బానిస బతుకు | Majority of trafficking victims are women and girls.

Human trafficking turns into sexual exploitation

United Nations Office on Drugs and Crime, UNODC, sexual exploitation, Human trafficking, Women, girls sex slaves, Human Trafficking sex slaves, Human Trafficking UN report

United Nations Office on Drugs and Crime new report says Women, girls form nearly 3/4 of all human trafficking victims.

వాళ్లకి వ్యభిచారం, బ్లూ ఫిల్మ్స్ అదే లోకం

Posted: 12/23/2016 04:47 PM IST
Human trafficking turns into sexual exploitation

హ్యూమన్ ట్రాఫికింగ్(మనుషుల అక్రమ రవాణా) ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ మాఫియాను అరికట్టేందుకు ఆయా దేశాలు కఠిన చట్టాలను తెచ్చే యత్నం చేసినప్పటికీ అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఐక్యరాజ్యసమితికి చెందిన మాదక ద్రవ్యాలు, నేరాల నిరోధక కార్యాలయం (యూఎన్‌ఓడీసీ) విడుదల చేసిన ఓ నివేదికలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి.

కేవలం వ్యభిచారం కోసం, నీలి చిత్రాల నిర్మాణం కోసం, వెట్టిచాకిరి కోసమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. పసిప్రాయంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లి సెక్స్ బానిసలుగా, పని మనుషులుగా మార్చేసుకుంటున్నారు. మగ పిల్లలను అయితే గనుల మైనింగ్‌ కార్యకలాపాల్లో, ప్రైవేటుసైన్యంలో, టెర్రరిస్టుల తరఫున ఆయుధాలుగా మార్చేసుకుంటున్నారు. అంతేనా బిచ్చగాళ్ల ముఠాలు కూడా ఇందుకు మినహాయింపేం కాదు.

ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే కాదు, దేశాలు,ఖండాలు ఇలా ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. యూఎన్ విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు పిల్లలే బాధితులుగా ఉంటున్నారు. మొత్తం అక్రమ రవాణాలో 28 శాతం పిల్లలు ఉంటున్నారు. ఇక మహిళలు, బాలికలను కలుపుకొంటే 71 శాతం మంది ఉన్నారు. మహిళలను, బాలికలను సెక్స్‌ ట్రేడ్‌లోకి దించుతున్నారు, నీలి చిత్రాల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా రవాణా అవుతున్న 28 శాతం పిల్లల్లో సబ్‌ సహారా ఆఫ్రికా, మధ్య అమెరికా, కరేబియన్‌ ప్రాంతాలకు చెందిన పిల్లలే 62 నుంచి 64 శాతం ఉంటున్నారు. ఇది కేవలం 2012 నుంచి 2014 ఏళ్ల మధ్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగిన మానవ అక్రమ రవాణా వివరాలు మాత్రమే. ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని వాళ్లని తమ ఉచ్చులోకి లాక్కుంటున్నారని యూఎన్‌ఓడీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యూరి ఫెదదోవ్‌ చెబుతున్నాడు.

2003 లో ప్రపంచంలోని 18 శాతం దేశాల్లో కఠినచట్టాలు అమల్లో ఉండగా, నేడు 88 శాతం దేశాల్లో కఠినచట్టాలు ఉన్నాయని, అయినా ఈ రవాణాకు అడ్డుకట్ట పడలేకపోతుందని ఆయన వాపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 2030 సంవత్సరం నాటికి మానవ అక్రమ రవాణాను గణనీయంగా అరికట్టాలనే ఉద్దేశ్యంతో తమ విభాగం పని చేస్తోందని వివరించాడు. లక్ష్యాలను సాధించాలంటే ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు విధించాల్సి ఉంటుందని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చాడు ఆయన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UN Report  UNODC  Human trafficking  sexual exploitation  

Other Articles