అది అమలైతే.. కన్నడిగులకు ఉద్యోగాలే ఉద్యోగాలు.. Kannadigas may get 100% reservation in private sector industries

Karnataka may introduce 100 local quota for blue collar jobs

Reservation, Kannadigas, Karnataka Industrial Employment, private sector, concession, 100 percent reservation, BJP, Congress, Socialist government, Karnataka

The labour department will give 100 percent horizontal reservation for Kannadigas in all private industries, except the IT-BT sector, which secure concessions under the state industrial policy.

కర్ణాటకలో ఉద్యోగాలకు ‘‘నో వెకన్సీ’’

Posted: 12/23/2016 03:27 PM IST
Karnataka may introduce 100 local quota for blue collar jobs

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రత్యర్థుల పాచికలు పారకుండా మరోమారు రాష్ట్రంలో అధికారాన్ని తమ పార్టీయే చేపట్టేందుకు అనువైన దిశగా పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్యా. మరో మూడు నెలల్లో ఎన్నకలు రానున్న ఉత్తర్ ప్రదేశ్ లో 17 బిసీ కులాలను ఎస్సీ జాబితాలోకి చేర్చి కులం కార్డులో ఓట్లను కొల్లగొడుదామని అఖిలేష్ ప్రభుత్వం భావిస్తుండగా, కులం కార్డుకన్నా ప్రాంతీయ కార్డుకే ఓట్లు ఎక్కువ అనుకున్నారో ఏమో కానీ ఏకంగా ప్రాంతీయత కార్డును వేసి ఓట్లను గుమ్మరించుకునేందుకు రెడీ అయ్యింది కర్ణాటక సర్కార్.

2017 ద్వితీయార్థంలో ఎన్నికలకు వెళ్లనున్న కర్ణాటక సర్కార్ నిరుద్యోగులకు, యువతకు గాలం వేసింది. దేశంలో ఐటీ కేంద్రాలలో ఒకటిగా బాసిల్లుతున్న బెంగళూరు అనేక రాష్ట్రాల వారిని అకర్షిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు అనేక రాష్ట్రాల ప్రజలు బెంగుళూరుకు వలసవెళ్లి.. అక్కడ స్థిరపడ్డారు. దీనికి కారణం బెంగళూరులో ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు కూడా విపరీతంగా ఉండడమే. చదువురాని వాళ్లకు కూడా ఏదో ఒక చిన్న బడ్డీ కోట్టు పెట్టుకుని బతుకు బండిని నడుపుదామని భావించి వెళ్లారు.

మరీ ముఖ్యంగా బెంగళూరు వాతవరణం అందరికీ అనుకూలంగానే వుంటుంది. అహ్లాదకర వాతావరణంలో మంచి ఉద్యోగం లభిస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. దీంతో ప్రస్తుతం బెంగళూరు అందరినీ అకర్షిస్తుండగా, దీనికి కళ్లెం వేయబోతుంది కర్ణాటక ప్రభుత్వం ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బయో టెక్నాలజీ (బిటీ) మినహా అన్ని ప్రైవేటు రంగాల పరిశ్రమల్లోనూ కర్ణాటక వాసులకు మాత్రమే ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని సవరణలను చేయబోతోంది.

1961 పారిశ్రామిక చట్టంలో ఇందుకు అవసరమమైన మార్పులను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం కర్ణాటక అసెంబ్లీలో త్వరలోనే ఒక బిల్లును కూడా పెట్టాలని, దానిని అమోదిస్తూ తీర్మాణం చేసిన తరువాత అమలుపర్చే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. అయితే ఆ సవరణ చట్టంతో కర్ణాటకలో జన్మించిన వారికి లేదా.. కర్ణాటకలో 15 ఏళ్లుగా నివాసముంటున్న వారికి, అందునా కన్నడంలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలు లభించేవిధింగా మర్పాలు చేర్పులు చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే ఇకపై కన్నడీగులకు ఉద్యోగాలే. ఉద్యోగాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reservation  Kannadigas  Karnataka Industrial Employment  private sector  concession  

Other Articles