చెత్త వేస్తే ఇక మీకు చినిగిపొద్దీ... | Rs 10000 fine for littering in public place.

Fine for throwing waste in public place

National Green Tribunal, littering in public, India littering in public, Garbage in India, India Pollution, NGT on Pollution, littering India, Swachh Bharat Abhiyan NGT, NGT Delhi, Littering punishedm, 10000 fine littering

National Green Tribunal ordered Pay Rs 10,000 fine for throwing waste in public place.

చెత్త రూల్స్ ... అసలు ఎవరు పాటిస్తారు?

Posted: 12/20/2016 08:12 AM IST
Fine for throwing waste in public place

ప్రభుత్వాలు ప్రారంభించే ఏ పథకాలకైనా సరే ప్రజా మద్ధతు, సహకారం ఉంటేనే అవి నూటికి నూరు పాళ్లు విజయాన్ని సాధిస్తాయి. అయితే స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు వేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తడబాటుకి గురవుతూనే ఉంది. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే పదివేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల(2016) ప్రకారం చెత్తాచెదారాన్ని సేకరించి నిర్దేశిత ప్రాంతానికి తరలించే బాధ్యత అధికారులదేనని ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. మునిసిపల్ ఘన వ్యర్థాలు, చెత్తాచెదారం సమస్యలు ఢిల్లీలోనే అధికమని పేర్కొంది. చెత్తాచెదారం విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తే ప్రజారోగ్యానికి ఎటువంటి హానీ ఉండదని తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, కూరగాయల మార్కెట్లు, వధశాలలు నిబంధనల మేరకు చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలని పేర్కొంది.

తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరుచేసి తరలించాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేస్తే రూ.10వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ తీరుపై దాఖలపై పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్ స్వతంత్ర కుమార్ సారథ్యంలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మన ఆరోగ్యం గురించే కాదు.. ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. చెత్త రహిత దేశంగా రూపొందించటంలో ప్రభుత్వాలకు సహకరించాలని ప్రజలకు బెంచ్ పిలుపునిచ్చింది. 

అయితే జీహెచ్ఎంసీ గతంలోనే ఇలాంటి నిబంధనను తెచ్చినప్పటికీ, అది విజయవంతం కాకపోవటం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  NGT  Littering in public  10000 fine  

Other Articles