నోట్ల రద్దు, సొంత పార్టీ.. స్వామి టార్గెట్ | Subramanian Swamy on demonetisation failure.

Subramanian swamy shocking comments on demonetization

MP Subramanian Swamy, Subramanian Swamy Arun Jaitley, Arun Jaitley demonetization, Subramanian Swamy demonetization, demonetization modi government

BJP Rajyasabha MP Subramanian Swamy says Arun Jaitley did not plan the demonetization well.

నోట్ల రద్దుపై కేంద్రమే కేసు వేయాలా?

Posted: 12/20/2016 09:00 AM IST
Subramanian swamy shocking comments on demonetization

సొంత పార్టీ నేతతో సుబ్రహ్మణ్య స్వామితోనే బీజేపీకి తలపొటు ఎక్కువ అవుతోంది. మోదీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాల కంటే ముందుగా రంగంలోకి దిగిపోయి విమర్శలకు దిగటం ఆయనకు అలవాటుగా మారిపోయింది. తాజాగా దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న నోట్ల రద్దుపై సొంత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు స్వామి.

నోట్ల రద్దు విషయం ముందుగానే లీకైందని అన్నారు. సోమవారం కోయంబత్తూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపైనా, కేంద్రంపైనా మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిందని, నోట్లు రద్దు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని అన్నారు.

నోట్ల రద్దు ప్రకటనకు ముందు ఏటీఎంలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, పన్నులను తగ్గించాలని కేంద్రానికి తాను సూచించినట్టు తెలిపారు. అయితే తాను చేసిన సూచనలను ఆర్థికమంత్రి జైట్లీ పక్కనపెట్టారని విమర్శించారు. ప్రస్తుత నోట్ల కష్టాలకు ఆయనే కారణమని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందుగానే లీకైందని, అయితే ఈ విషయంలో కేసులు వేసే ఆలోచన తనకు లేదని, అయితే కేంద్రమే కేసు వేయాలంటూ వెరైటీ వ్యాఖ్యలు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP Subramanian Swamy  demonetization  Arun Jaietly not plan well  

Other Articles