ఫ్లైట్ కి యాక్సిడెంట్ కాకూడదంటూ అమానుషం.. నల్ల మేకను బలిచ్చారు. ఎక్కడా? | Airline sacrifices a goat before plane take off.

Pakistan airline mocked for goat sacrifice

Pakistani airline staff, black goat slaughter, Pak airport slaughter, airport runway black goat, black goat be headed, slaughter airport, Pakistan black goat

Pakistani airline staff slaughter black goat on airport runway.

విమానం టేకాఫ్ కి ముందు బలిచ్చేశారు

Posted: 12/20/2016 07:54 AM IST
Pakistan airline mocked for goat sacrifice

హేతువాదులు ఎంత మొత్తుకుంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, సాంప్రదాయాలు తదితర అంశాలను సాకుగా చూపుతూ ఇప్పటికీ మూఢనమ్మకాలను బలంగా నమ్ముతూ వస్తున్నారు. అయితే గొప్ప చదువులు చదివి, పైగా ఉన్నత అధికారులుగా చెలామణి అయ్యేవారు వీటిని పాటిస్తేనే కాస్త విడ్డూరంగా ఉంటుంది.

తాజాగా పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది చేసిన పనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 7న పాక్ లోని హవేలియన్ సమీపంలో 47 మంది ప్రయాణికులతో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని వారంతా మరణించారు. దీంతో సర్వీసులను నిలిపేసిన వైమానిక సంస్థ, సర్వీసులన్నిటికీ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి, మరమ్మతులు పూర్తి చేసింది.

ఇక ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదంటూ ఇస్లామాబాద్ విమానాశ్రయ సిబ్బంది రన్ వే పై నల్లమేకను బలి ఇచ్చారు. ఆపై ఏటీఆర్ విమానం ఇస్లామాబాద్ నుంచి ముల్తాన్ బయల్దేరింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ నిర్ణయంతో అధికారులకు సంబంధం లేదని, తామే మేకను బలివ్వాలని నిర్ణయించుకున్నామని, నిర్ణయించుకున్న ప్రకారం చేశామని సదరు విమానయాన సంస్థ సిబ్బంది వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Airport Runway  Black Goat Slaughter  

Other Articles