‘ఆ’ పోలీసులపై సోషల్ మీడియాలో విమర్శల పర్వం Pranav Dhanawade, the record-making cricketer, detained by police

Pranav dhanawade the record making cricketer detained by police

pranav dhanawade, dhanawade, pranav dhanawade record, pranav dhanawade police, mumbai police, Union Minister, Prakash Jawedkar, cricket news, cricket

Record holding cricketer Pranav Dhanawade from Kalyan was in for some rough treatment by police alongwith his father Prashant, who had got into argument with police after they asked him to vacate the ground they were practicing in.

‘ఆ’ పోలీసులపై సోషల్ మీడియాలో విమర్శల పర్వం

Posted: 12/18/2016 12:41 PM IST
Pranav dhanawade the record making cricketer detained by police

ఇంటర్‌ స్కూల్‌ టోర్నీలో భాగంగా ఓ ఇన్నింగ్స్‌లో అజేయంగా 1009 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన  ’క్రికెట్‌ సంచలనం’ ప్రణవ్‌ను పోలిస్ స్టేషన్‌కు తరలించి.. తప్పుడు కేసు బుక్‌ చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై సోషల్ మీడియా మండిపడుతుంది. పోలీసులు తమ చేతిలో అధికారం వుందికదా అని ఎవర్ని పడితే వారిపై జులుం సాగించాలని చూడటానికి ఈ ఘటనే నిదర్శనమని నెట్ జనుల విమర్శలు పెల్లుబిక్కతున్నాయి. ఎదురుతిరిగినందుకు ఏకంగా క్రికెట్ సంచలనంపైనే కేసులు నమోదు చేస్తారా..? అంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏ స్థాయిలో నైనా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్‌తో పాటు పలువురు క్రికెట్‌ క్రీడా దిగ్గజాల మన్ననలు అందుకున్న ప్రణవ్  ముంబైలోని కళ్యాణ్‌ ప్రాంతంలో గల సుభాష్‌ మైదానంలో ప్రాక్టీసు చేస్తుండగా, అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన పోలీసులు గ్రౌండ్ లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని అదేశాలు ఇచ్చేశారు. అయితే మైదానం వదిలి వెళ్లడానికి ప్రణవ్‌ నిరాకరించాడు. క్రీడా స్థలాన్ని పొలిటికల్‌ లీడర్స్‌ హెలికాప్టర్‌లు దిగడానికి ఎందుకు కేటాయిస్తారని వాదించాడు.

దీంతో ఎస్సై కదమ్‌ ప్రణవ్‌పై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న ప్రణవ్‌ తండ్రి ప్రశాంత్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రణవ్‌తో పాటు తండ్రిని పోలీసులు తీసుకెళ్లి జీపులో పడేసి.. బజార్‌పెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన పోలీసులు తమపై తప్పుడు కేసు బనాయించాలని చూశారని ప్రణవ్‌ వాపోయాడు. ఆ ప్రాంతంలో రెండు ఉర్దూ పాఠశాలల్లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్న కేంద్ర మంత్రి జవదేకర్‌.. వాస్తవానికి ఆ పర్యటనను చివరి నిమిషంలో కేంద్రమంత్రి రద్దు చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranav Dhanawade  Kalyan  Prakash Jawedkar  rough treatment  chopper  mumbai  

Other Articles