నవ్యాంధ్రకిచ్చిన హామీని బీజేపి నిలబెట్టుకోవాలి: పవన్ కల్యాన్ BJP reneged on AP special status promise: Pawan Kalyan

Bjp should answer why it went back on scs says pawan kalyan

pawan kalyan, pawan kalyan AP special status, Andhra pradesh special status, pawan kalyan patriotism, pawan kalyan janasena, powerstar pawan kalyan, pawan kalyan telugu actor, pawan kalyan supreme court, pawan kalyan bjp, supreme court rules, pawan kalyan news, entertainment news, india news, tollywood, latest movie news

Jana Sena Party president Pawan Kalyan on launched a scathing attack on the BJP through Twitter, this time accusing it of going back on its election promise to give Special Category Status to Andhra Pradesh.

నవ్యాంధ్రకిచ్చిన హామీని బీజేపి నిలబెట్టుకోవాలి: పవన్ కల్యాన్

Posted: 12/18/2016 04:38 PM IST
Bjp should answer why it went back on scs says pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నవ్యాంద్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన బీజేపీ, అధికారంలోకి రాగానే దానిని విస్మరించిందని అన్నారు. స్పెషల్ ప్యాకేజీ కంటితుడుపు చర్య మాత్రమేనని, దీని వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో ప్రత్యేక అనే పదం తప్ప ఏమీలేదని దుయ్యబట్టారు. దశాబ్దంపాటు ఆంధ్రులు అన్యాయానికి గురయ్యారని అన్నారు. రాజధాని లేకుండా భారీ ఆదాయ లోటును రాష్ట్రానికిచ్చారని పేర్కొన్నారు.

ఆంధ్రులను వెన్నెముకలేని, ఆత్మాభిమానం లేనివారిగా కేంద్రం భావిస్తోందన్నారు. ఈ కారణంగానే ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేసిన ఆయన ఆంధ్రులు దశాబ్దంపాటు ఎన్నో అవమానాలను భరించారన్నారు. ఆంధ్రులకు కనీసం రాజధాని లేకుండా గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ప్రత్యేక హోదా అన్నారు... ఇప్పుడు ప్యాకేజీ అంటున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

జై ఆంధ్ర ఉద్యమంలో 400 మందికిపైగా యువకులు ప్రాణత్యాగం చేశారని, దీనిని ఆంధ్రులు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. 400 మంది ప్రాణాలపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీపై పోరాటం చేస్తామని పవన్‌కల్యాణ్‌ తేల్చిచెప్పారు. మూడు రోజులుగా రోజుకో అంశంపై పవన్ ట్విట్టర్‌లో ప్రశ్నలు సంధిస్తున్నారు. గోవధ, రోహిత్ వేముల మృతి, దేశభక్తిపై బీజేపీపై టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన పనవ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ట్విట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Andhra Pradesh  special status  bjp  

Other Articles