నోట్ల రద్దుతో వ్యవహరంలో ప్రధానిపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు Rahul Gandhi calls note ban 'Modi-made disaster'

Demonetisation a modi made disaster calls rahul gandhi

rahul gandhi, rahul gandhi speech, rahul gandhi on demonetisation, demonetisation, rahul gandhi on modi, narendra modi government, india news

Rahul Gandhi alleged that about Rs six lakh crore was deposited in the banks in September before the announcement of demonetisation move and the money belonged to BJP and Modi's friends.

నోట్ల రద్దు వ్యవహరంలో ప్రధానిపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

Posted: 12/18/2016 07:56 AM IST
Demonetisation a modi made disaster calls rahul gandhi

పెద్ద నోట్ల రద్దు అనేది ‘మోదీ సృష్టించిన వినాశనం అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. దేశ జనాభాలో ఒక శాతం ఉన్న కుబేరుల కోసం మొత్తం దేశ ప్రజలను అయన శిక్షించారన్నారు. అయితే తెరచాటుగా అక్రమమార్గాల్లో మాత్రం నల్లకుబేరులు తమ డబ్బును మార్చేసుకున్నారని అరోపించారు. ప్రధాని మోడీ యావత్ దేశ ఆర్థిక వ్యవస్థపైనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కర్ణాటకలోని బెల్గావ్‌లో కాంగ్రెస్‌ సభలో రాహుల్‌ పాల్గొన్నారు. భారత చరిత్రలోనే తొలిసారి ఒక మోదీ దేశ ప్రజలపైనే దాడికి పాల్పడ్డారని విరుచుకుపడ్డారు.

ప్రధానమంత్రులు ఎవరైనా దేశం కోసం పనిచేస్తారని, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపథంలో పయనించేందుకు కృషి చేస్తారని.. కానీ నరేంద్రమోదీ మన ఆర్థిక వ్యవస్థపైనే దాడికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. మనుషులు సృష్టించిన వినాశనం అన్నట్లు నోట్ల రద్దు.. ఆ తర్వాత పరిణామాలను మోదీ సృష్టించిన వినాశనంగా పేర్కోన్నాల్సి వస్తుందని అగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఫిడెల్‌ క్యాస్ట్రోకు నివాళులర్పించారు కానీ,  నోట్ల రద్దుతో దేశంలో ప్రాణాలు కోల్పోయిన వందల మంది కోసం 2నిమిషాల పాటు మౌనం పాటించే సమయం బీజేపీ నేతలకు లేకపోయిందని మండిపడ్డారు.

ఈ మరణాలకు మోదీనే కారణమని, రెండున్నరేళ్లుగా మోదీ ప్రభుత్వం పేదలపై అఘాయిత్యాలకు పాల్పడుతోందన్నారు. తొలుత తమ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కాంక్షించి తీసుకువచ్చిన భూచట్టంలో సవరణలు చేశారని, అడ్డగోలు సవరణలని తాము వ్యతిరేకించి.. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టగానే దానిని వెనక్కు తీసుకున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వం చేస్తున్నది పేద ప్రజల జపమని, అయితే కాంక్షిస్తున్న మేలు మాత్రం పెట్టుబడి దారులదేనని రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  demonetisation  PM modi  narendra modi  bellary  karnataka  

Other Articles