నోట్ల రద్దు: ఇందిరాగాంధీపై అరోపణలకు బదులిచ్చిన శరద్ పవార్ Demonetisation: Sharad Pawar slams Modi for dragging Indira

Sharad pawar slams modi for dragging indira into note ban debate

Sharad Pawar, Narendra Modi, Indira Gandhi, Note ban, Demonetisation, Congress, demonetisation, cash ban, Sharad Pawar on demonetisation, Remonetisation, Arun Jaitley on remonetisation, New notes, Note ban

Nationalist Congress Party president Sharad Pawar hit out at Prime Minister Narendra Modi over his statement about Indira Gandhi refusing to scrap high-value notes.

ఇందిరాగాంధీపై విమర్శలకు శరద్ పవార్ ధీటైన బదులు

Posted: 12/18/2016 08:39 AM IST
Sharad pawar slams modi for dragging indira into note ban debate

నోట్ల రద్దు అంశంలోకి స్వర్గీయ ప్రధానమంత్రిని లాగడంపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గరభీ హటావో వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకుని దేశంలో పేదరికం లేకుండా అమె చేపట్టిన చర్యలను ఇప్పటికీ దేశ ప్రజలు మర్చిపోలేరని, అమె తీసుకున్న అప్పటి నిర్ణయాలతో అమె ఇప్పటికీ దేశప్రజల మనస్సులోకూ శాశ్వతంగా గూడుకట్టుకుని వున్నారని అన్నారు. అలాంటి అధినేత్రిపై నోట్ల రద్దు అంశాన్ని ఎందుకు చేపట్టలేదని బురదజల్లేందుకు బీజేపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.

1971లో వాజో కమిటీ పెద్ద నోట్లను రద్దు చేయాలని ఇందిరాగాంధీకి సిఫార్సు చేసినా.. అమె ఆ కమిటీ నివేదికను తోక్కిపెట్టి దేశానం నాశనం చేశారన్న ప్రధానం అరోపణలపై పవార్ మండిపడ్డారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేయడమే బీజేపి ముఖ్యంగా నరేంద్రమోడీ ప్రభుత్వానికి పనిగా మారిందని ఎద్దేవా చేశారు. ఇంధిరా గాంధీ తరువాత కేంద్రంలో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రభుత్వాలు కూడా వచ్చాయని మరి వారి హాయంలో పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇప్పుడు ఇందిరాగాంధీకి అపఖ్యాతిని మూటగట్టే ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని.. మరి వారి ప్రభుత్వ హాయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయాలను తీసుకోలేదో చెప్పాలని నిలదీశారు. కేంద్రంలోని ప్రభుత్వం అంటే కేవలం ప్రధాన మంత్రి ఒక్కరే కనిపిస్తున్నారని, ఆయన ఒక్కరే ఎవరితోనూ చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, అయితే అది వారి వ్యక్తిగత విషయం.. కానీ ఇతరులను నిందించకుండా తన నిర్ణయాలను ఎలా విజయవంతం చేయాలో చూసుకోవాలని అన్నారు. దేశం మొత్తం డబ్బుల కోసం రోడ్లపైకి వచ్చి.. బ్యాంకుల ముందు క్యూకట్టాలన్నది మోడీ సర్కార్ నిర్ణయంలా వుందని ధ్వజమెత్తారు.

మీ ప్రభుత్వంలో మీరు తీసుకున్న నిర్ణయమే అయినా.. కోట్ల కోద్ది డబ్బు ఎలా అక్రమంగా తరలివెళ్లిందని, అదాయ శాఖ దాడుల్లో అదెలా భయపడుతుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో మరణించిన ఉగ్రవాదుల వద్ద కూడా కొత్త రెండు వేల రూపాయల నోట్లు లభ్యం అయ్యాయి, మరి మీ ప్రభుత్వం ముందుచూపు, ముందు జాగ్రత్త ఎమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మీ ప్రభుత్వం డొల్లతనం ఇక్కడే బయటపడుతుందని శరత్ పవార్ ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharad Pawar  Narendra Modi  Indira Gandhi  Note ban  Demonetisation  Congress  

Other Articles