దేశభక్తి నిరూపించుకునేది కాదు.. అవకాశం వస్తే చాటుకునేది: పవన్ కల్యాన్ Pawan Kalyan slams SC order on national anthem

Pawan kalyan slams bjp asks why should one prove his patriotism

pawan kalyan, pawan kalyan national anthem, pawan kalyan patriotism, pawan kalyan janasena, powerstar pawan kalyan, pawan kalyan telugu actor, pawan kalyan supreme court, pawan kalyan bjp, supreme court rules, pawan kalyan news, entertainment news, india news, tollywood, latest movie news

Tollywood actor and Jana Sena party leader Pawan Kalyan engaged in a Twitter tirade targeting the BJP-led government over the issue of patriotism.

దేశభక్తి నిరూపించుకునేది కాదు.. అవకాశం వస్తే చాటుకునేది: పవన్ కల్యాన్

Posted: 12/17/2016 05:41 PM IST
Pawan kalyan slams bjp asks why should one prove his patriotism

కేంద్రంలోని బీజేపి అనుసరిస్తున్న దేశభక్తి విధానాలు యావత్ దేశప్రజలకు ప్రశార్థకంగా మారాయని జనసేన అధినేత, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత రెండు రోజులుగా ఆయన కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ లో సోషల్ వార్ చేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే ఇవాళ 'దేశభక్తి' అంశంపై ట్వీట్‌ చేశారు. దేశభక్తి అన్నది నిరూపించుకోవాల్సిన అవసరం ఏ భారతీయుడికీ లేదని, అయితే అవకాశం వస్తే మాత్రం తాను భారతీయుడ్ని అని చాటుకుంటారని ఇదే మన దేశంలో వున్న గోప్పదనమన్నారు.

'కులం, మతం, జాతి, ప్రాంతం, వర్గం, భాషకు అతీతంగా ఒక వ్యక్తిగానీ, రాజకీయ పార్టీగానీ వ్యవహరిస్తే దానిని నిజమైన దేశభక్తి అంటారు. ఒక పార్టీ ఆదర్శాలు, దృక్పథాల ఆధారంగా దేశభక్తిని చూడలేం' అని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. మానవీయ విలువల్లో, సామరస్య భావనలో నిజమైన దేశభక్తి దాగి ఉంటుందని అన్నారు. 'ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అభిప్రాయంతోగానీ, విధానంతోగానీ విభేదిస్తే.. వారిని దేశద్రోహులుగా ముద్ర వేయకూడదు. ఒకవేళ వారు తమ ప్రత్యర్థుల గురించి తీవ్ర అభిప్రాయాలు వెల్లడించినా.. వారి గొంతును నులిమివేయకుండా మొదట వారు చెప్పేది వినాలని సూచించారు.

ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా హడావిడిగా చర్యలు తీసుకుంటే జేఎన్‌యూ విద్యార్థులపై 'దేశద్రోహం' కేసు మాదిరిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశముంటుంది. జేఎన్‌యూ విద్యార్థుల కేసులో చివరకు వారి వీడియో కావాలని మార్చినట్టు తేలింది' అని అన్నారు. 'కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ ఆస్వాదించాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి' ని నిరుపించేకునే పరీక్షకు వేదికగా మార్చకూడదని పవన్‌ పేర్కొన్నారు.

సినిమా థియేటర్లలోనే ఎందుకు? రాజకీయ పార్టీలు తమ సభల్లో మొదట జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించవు? దేశంలోని ఉన్నత కార్యాలయాల్లో ఎందుకు ఆలపించడం లేదు? చట్టాలను అమలుచేయాలని ప్రబోధించే వారు మొదట తాము మార్గదర్శకంగా ఉండి ఇతరులు అనుసరించేలా చేయవచ్చు కదా' అని పవన్‌ పేర్కొన్నారు. 'నిజాయితీపరులకు చట్టాలను ఉచ్చుగా మార్చి.. కపటవేషగాళ్లకు వాటిని బొనంజా చేస్తున్నారా' అన్న అమెరికా ఆర్థికవేత్త థామస్‌ సోవెల్‌ వ్యాఖ్యలను పవన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తానని ఆయన ట్వీట్‌ చేశారు. జేఎన్‌యూను జేఎన్‌టీయూ అని పొరపాటున రాసినందుకు ఆయన క్షమాపణ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  national anthem  janasena  patriotism  supreme court  bjp  

Other Articles