దేశానికి వన్నె తెచ్చిన సైనాపై నెట్ జనుల మండిపాటు Saina Nehwal has been tagged 'anti-national'

Saina nehwal branded anti national for endorsing chinese brand

Saina Nehwal, Badminton, Honor brand ambassador, China mobile phone, Anti-National, Integrity Ambassador, Badminton World Federation, Christinna Pedersen, Viktor Axelsen, Misaki Matsutomo, Ayaka Takahashi

Saina Nehwal, the only Indian badminton player to achieve the world No.1 rank, was tagged anti-national for endorsing a Chinese-brand phone.

దేశానికి వన్నె తెచ్చిన సైనా నెహ్వాల్.. దేశద్రోహా..?

Posted: 12/14/2016 07:20 PM IST
Saina nehwal branded anti national for endorsing chinese brand

భారత ధేశం నుంచి బ్యాడ్మింటన్ క్రీడలో ప్రాతినిధ్యం వహిస్తూ.. దేశానికే వన్నే తీసుకోచ్చిన క్రీడాకారిణి అమె. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా రాణించి.. భారత్ దేశం నుంచి నెంబర్ వన్ స్తానాన్ని అధిరోహించిన ఏకైక క్రీడాకారిణి సైనా. అలాంటి సైనాపై నెట్ జనులు అమాంతంగా విషం కక్కుతున్నారు. అమెను దేశ ద్రోహిగా పరిగణిస్తున్నారు. ఎందుకు అంతలా అమెను విమర్శలపాలు చేస్తున్నారు.

మ్యాటర్ లోకి ఎంటైర్ అయితే.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ హానర్ 8 కు సైనా అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ ఫోన్ పట్టుకుని దిగిన ఓ ఫోటోను సైనా ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పోస్టు చేస్తూ ఓ కామెంట్ ను కూడా రాసింది. అది సహజం కదండీ.. అలానే అమె కూడా 'నా కొత్త హానర్8 ఫోన్ అంటే నాకెంతో ఇష్టం. దాని కలర్‌ను కూడా నేను ఇష్టపడుతున్నా' అంటూ ఒక కామెంట్ కూడా ఆ పోస్టింగ్‌కు సైనా జతచేసింది.

అంతే అప్పటివరకు తనను అభిమానించిన షోషల్ మీడియా ప్రపంచం.. ముఖ్యంగా భారత్ లోని అభిమానులు, ఫాలోవర్లు.. ఒక్కసారిగా అమెపై మండిపడ్డారు. చైనా కంపెనీకి ప్రచారాన్ని వెంటనే ఆపివేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఇండియాలో తయారైన ఉత్పత్తులకు కాకుండా చైనా ప్రోడక్ట్‌కు ప్రచారం చేపట్టడం 'దేశ వ్యతిరేకమైన చర్య'గా మరికొందరు తీవ్రంగా విమర్శించారు. చైనా వస్తువులను ఎంతమాత్రం ప్రమోట్ చేయవద్దని, అది దేశానికి కీడు చేస్తుందని మరో అభిమాని సూచించాడు. 'నేను నీ అభిమానిని. చైనా వస్తువులకు ప్రచారం చేస్తే నిన్ను ద్వేషిస్తాను' అని మరొక అభిమాని హెచ్చరించాడు. అంతే మరి అభిమానలోకం.. హద్దులు లేని అభిమానం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  Badminton  Honor brand ambassador  China mobile phone  Anti-National  

Other Articles