శ్రీవారికే టోకరా.. హుండీ డబ్బుతో పారిపోయేందుకు యత్నం Man caught stealing from Tirumala Hundi

Man arrested for stealing cash from tirumala srivari hundi

navanita krishnan, arrest, balaji temple, tirupathi, hundi, tirumala, srivari nilayam, siva kasi, Andhra pradesh, Man steals from Tirumala Hundi, Tirumala Hundi theft caught on camera,Tamil nadu, crime news

A man from TamilNadu sivakasi named navanita krishnan arrested for stealing cash from tirumala srivari hundi and tried to escape.

ITEMVIDEOS: శ్రీవారికే టోకరా.. హుండీ డబ్బుతో పారిపోయేందుకు యత్నం

Posted: 12/14/2016 04:48 PM IST
Man arrested for stealing cash from tirumala srivari hundi

కలియుగ వైకుంఠంగా భక్తుల అచెంచెల భక్తివిశ్వాసాలకు నిలయంగా మారి.. శ్రీవారు కోలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలోని హుండీకే టోకరా వేసేందుకు యత్నించి.. అడ్డగోలుగా బుక్ అయ్యాడు ఓ చోరుడు. వెన్న నుంచి కన్నీయ మనస్సులను దోచుకునే వరకు చిన్నారి కిట్టయ్య (అదే నండీ వేంకటేశ్వర స్వామి) మించిన వారెవరూ. అలాంటిది అయనకు సమర్పించిన కానుకలనే హరించాలని యత్నిస్తే.. పట్టించక ఊరుకుంటాడా.? అడ్డంగా బుక్ చేయిస్తాడు.

ఇవాళ తిరుపతిలో జరిగిన ఘటన అలాంటిదే. శివకాశీకి చెందిన నవనీతకృష్ణన్‌ భక్తులతో పాటు ఆలయంలోకి ప్రవేశించి దర్శనానంతరం బయటకు వచ్చారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన అదనపు హుండీలో నుంచి నగదు రూ. 15వేలు చోరీ చేసి పారిపోయేందుకు యత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కడం.. వెనువెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడం.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని చోరీకి యత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇదే వ్యక్తి గతంలో కూడా శ్రీవారి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడని సీఐ నాగరాజు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles