అమ్మ ఆత్మ ప్రతీకారం కోరుకుంటుందా? సమాధి నుంచి సౌండ్లు ఏంటి? | Jayalalitha angry with her funeral.

Jayalalitha really became ghost

Amma Jayalalitha's Ghost, Jayalalitha Soul, Jayalalitha Primi Minister Desire, Jayalalitha Tomb, Jayalalitha's Ghost Found, Jayalalitha ghost photo

Amma Jayalalitha's Ghost Found At tomb.

అమ్మ ఆత్మ ప్రతీకారం ఎవరి మీదనో?

Posted: 12/13/2016 08:13 AM IST
Jayalalitha really became ghost

‘అమ్మ’గా ప్రజల నీరాజనాలు అందుకున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణం అందిరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళులకు ఆమెను ఖననం చేసిన మెరీనా బీచ్ యాత్రా స్థలంలా మారిపోయింది. ఇదే సమయంలో ఊహించినట్లుగానే కొత్తరకం పుకార్లు లేపటం మొదలైంది. ‘అమ్మ’ సమాధి వద్ద ఓ ఆత్మ కనిపించిందంటూ, అది ఆమెదే నంటూ కొన్ని వెబ్ సైట్లు, ఛానెళ్లు కథనాలను ప్రసారం చేయటం ప్రారంభించాయి.

ఆత్మ కూడా ‘అమ్మ’ ఆకారాన్ని పోలి ఉందని, తన సమాధిని చూసేందుకు జయలలిత ఆత్మగా వచ్చిందంటూ అందులో పేర్కొన్నాయి. పిచ్చి పీక్స్ లోకి వెళ్లి ఒక ఫోటో కూడా జత చేశారు. దీంతో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మగా ఎందుకు మారిందోనంటూ పోస్ట్ మార్టం చేయటం ఆరంభించాయి సదరు మీడియా ఛానెళ్లు. ‘‘అమ్మకు ప్రధాని కావాలనే కోరిక బలంగా ఉండేదని, ఆ కోరిక తీరకపోవడంతో ఆమె ఆత్మగా మారి, సమాధి వద్దకు వచ్చి ఉంటుందని’’ కొత్త వాదన వినిపిస్తున్నారు.

ఇక మరికొందరైతే ఆమె అంత్యక్రియలు జరిగిన తీరుపై మండిపడుతున్నారు. కన్నడ వైష్ణవ బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె అంత్యక్రియలు సరైన పద్ధతిలో జరగకపోవటంతోనే ఆమె ఆత్మ శాంతిచక ఇలా ప్రేత్మాతగా మారిందని అంటున్నారు. నిజానికి సంప్రదాయం ప్రకారం చితి పేర్చి, నిప్పంటించాలే తప్ప, ఇలా ద్రవిడ, క్రైస్తవ సంప్రదాయం మేరకు పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టడం సంప్రదాయ వ్యతిరేకం. అందుకే ఆమె ఆత్మ శాంతిచటంలేదని వివరణలు ఇస్తున్నారు.

ఇక జయ ఆత్మ సమాధి వద్ద తిరగటం తామూ చూశామని పలువురు ప్రజలు కూడా చెప్పటం కొసమెరుపు. సమాధి నుంచి శబ్ధాలు వినిపిస్తున్నాయని, ఒకసారి ఓ చోట, ఇంకోసారి ఇంకో చోట ఇలా సమాధి పరిసర ప్రాంతాల్లోనే ఆమె ఆత్మ చక్కర్లు కొడుతుందని, ప్రజల కోసమే ఆమె మళ్లీ తిరిగి వచ్చిందని, ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తుందేమోనని ఇలా... కథలు కథలు వినిపిస్తున్నారు.

ఇప్పటికే అంతుపట్టని తమిళరాణి అంతఃపుర కుట్రల కథలతోనే మెదళ్లు వాచిపోతుంటే.. మళ్లీ ఈ కొత్త ట్విస్ట్ ఏంటా అని పలువురు జట్లు పీక్కుంటున్నారు. అయితే, వీటిని పలువురు కొట్టి పారేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇవేం నమ్మకాలు అంటూ తీసిపారేస్తున్నారు. ఫొటోషాప్ మాయాజాలంతో ఎవరో చేసిన పనికి ఇలాంటి వార్తలు రాసేయటమేనా అంటూ మండిపడుతున్నారు.

ఇది ఒక రివెంజ్ స్టోరీ...

జయలలితకు రక్తబంధువులు అందుబాటులో ఉన్నా సరే, వ్యక్తిగత సహయకురాలు శశికళ తో అంత్యక్రియలు జరిపించడం అందరినీ విస్మయానికి కూడా గురిచేసింది. జయలలిత జీవితాన్ని పూర్తిగా చెరబట్టిన శశికళ చివరకు మరణంలోనూ ఆమెను విడిచిపెట్టలేదు. తను అనుకున్నట్టే, ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా తానే అంత్యక్రియలు నిర్వహించింది. నిజానికి సంప్రదాయం ప్రకారమైతే దహనం చేయాలి. కానీ, అలా చేయలేదు. ఒకవేళ అంత్యక్రియలు చేస్తే, వాళ్లకు ఆటోమేటిక్ గా కొన్ని హక్కులు సంక్రమిస్తాయనే భయంతోనే శశికళ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఉంది. అలాంటప్పుడు తనకు బతికుండగానే కాదు.. చనిపోయాక కూడా శాంతి లేకుండా చేస్తున్న శశికళ అండ్ కో మీద అమ్మ ప్రతీకారం తీర్చుకుంటుందా చూద్ధాం.(ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయం మాత్రమే... )

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amma Jayalalitha  Jayalalitha's Ghost  Jayalalitha Tomb  Jayalalitha ghost photo  

Other Articles