ట్విట్టర్ లో ఫోటో పెట్టింది.. మూసేశారు | Hijab missing in twiiter photo, Saudi Woman Arrested.

Riyad woman arrested for posting pic in twitter

Saudi Woman Arrested, Saudi Arabia capital, Riyadh, Hijab arrest, Malak al-Shehri twitter, Malak al-Shehri arrest, Riyad woman arrest, Riyad Hijab arrest

Police in the Saudi capital said on Monday they had arrested a woman for taking off her veil in public and posting pictures of her daring action on Twitter.

అమ్మాయి ముఖంపైనా ముసుగేయాల్సిందే!

Posted: 12/13/2016 08:58 AM IST
Riyad woman arrested for posting pic in twitter

చట్టాలు కఠినంగా ఉండటం మంచిదే. కానీ, అవి మరీ జనాలకు ఇబ్బంది పెట్టేలా ఉండటం మాత్రం సరికాదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. ముఖ్యంగా సౌదీ దేశాలలో ఇవి ఎంత దారుణంగా ఉంటాయో తెలిసిందే. లైంగిక దాడులలో సరైన శిక్షలంటూ మరణదండన లేదా కొట్టి చంపటాలు ఇలా ఉంటుంటాయి. అదే సమయంలో మతపరమైన తప్పులకు అదే స్థాయి శిక్షలు అక్కడ అమలులో ఉన్నాయి.

తాజాగా ఓ యువతి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఆమెను ఇబ్బందుల పాలు చేస్తోంది. 20 ఏళ్ల ఆ యువతి(మొలాక్-అల్-షహరీ) తన ట్విట్టర్ లో అకౌంట్లో ఓ ఫోటో ఉంచింది. అలాగని అదేం అభ్యంతరకరమైంది కాదు. జస్ట్ బురఖా ధరించలేదు అంతే. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, దేశ బహిష్కరణ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

రియాద్ వీధిలో బురఖా లేకుండా(అయినా నిండు బట్టలతోనే ఉంది) ఓ ఫోటో దిగి పోస్ట్ చేసింది. అక్కడ ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు తప్పనిసరిగా బురఖా ధరించాలి, లేకపోతే శిక్షలు కఠినంగానే ఉంటాయి. అందుకే ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు.

చట్టాలను అతిక్రమించటమే కాదు.. పైగా యువకులతో రిలేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడుతుంది. ఆమెకు తప్పకుండా ఇస్లాం గురించి పాఠాలు బోధించాల్సిన అవసరం ఉంది అంటూ ఓ పోలీస్ అధికారి తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Woman arrest  missing Hijab  

Other Articles