71 ఏళ్ల మన మంత్రిగారి సెక్స్ సీడీ బయటికొచ్చేనా? | Senior Karnataka minister demands sex for transfer.

Karnataka excise minister in dock for sex tape

Senior Karnataka minister Scandal, H Y Meti sex scandal, RTI activist Rajashekhar Mulali, Rajashekhar Meti, Excise Minister Sex Scandal, Karnataka Minister Sex Scandal, Congress Leader Sex Tape, Senior Congress Leader Sex Tape, Meti Scandal, Siddaramaih Meti, Meti Threat

Senior Karnataka minister H Y Meti accused of seeking sex in return for favours

మంత్రిగారి రాసలీలల సీడీ బయటపెట్టాల్సిందే!

Posted: 12/12/2016 07:47 AM IST
Karnataka excise minister in dock for sex tape

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య టైం ఏ మాత్రం బాగోలేదు. వరుసగా వ్యక్తిగత విమర్శలు ఎదుర్కుంటున్న ఆయనకు ఈ మధ్య కేబినెట్ చేస్తున్న పాడు పనులతో చిక్కులు ఎదురవుతున్నాయి. టిప్పు జయంతి సందర్భంగా సాక్షాత్ పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి తన్వీర్‌ సేఠ్‌ ఫోన్ లో బూతు ఫోటోలు చూస్తూ అడ్డంగా బుక్కయిపోయిన విషయంత తెలిసిందే. ఈసారి ఏకంగా ఓ సీనియర్ మంత్రి నీలి చిత్రాల వ్యవహారంలో అడ్డంగా బుక్కయిపోవటం విశేషం.

కర్ణాటక అబ్కారీ శాఖ మంత్రి హెచ్.వై.మేటీ సాక్షాత్ విధానసౌధలోనే రాసలీలలు జరిపారు. బాగల్కోటేకు చెందిన ఓ ఉద్యోగిని తన బదిలీ విషయమై కొన్ని రోజుల క్రితం 71 ఏళ్ళ మేటీని ఆయన కార్యాలయానికి వచ్చింది. ఆ సందర్భంగా తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేసి, ఆపై ఆమెతో పలుమార్లు శృంగార కార్యాకలపాలు జరిపాడు. ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్ మెన్ సుభాష్ రహస్యంగా చిత్రీకరించాడు. దీంతో, మంత్రి మేటీ బండారం బట్టబయలయింది.

మేటీని సదరు మహిళతో కలసి మాజీ గన్ మెన్ సుభాష్ బెదిరించాడు. రూ. 15 కోట్లు ఇవ్వకపోతే వీడియోలను బయటపెడతానని హెచ్చరించాడు. అయితే, రూ. 15 లక్షలు ఇస్తానని మేటీ చెప్పాడు. ఇదే సమయంలో ఆర్టీఐ కార్యకర్త అయిన రాజశేఖర్ ములాలీకి సుభాష్ ఆ వీడియోను చూపించినట్లు తెలుస్తోంది. దీంతో మోలాలీ కొన్ని వీడియోలను మీడియాకు ఇవ్వడానికి యత్నించగా మంత్రి అనుచనులు బెదిరించారు. ఈ నేపథ్యంలో, బళ్లారిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు.

గన్ మెన్ సుభాష్ తో జరిపిన ఫోన్ సంభాషణను కూడా రాజశేఖర్ మీడియాకు, పోలీసులకు అప్పగించాడు. అయితే తన దగ్గర సీడీ లేదని, కాకపోతే తాను మాత్రం ఆ వీడియో చూశానని, అందులో ఉంది సదరు మంత్రేనని ఆయన వివరించాడు. దీని వెనుక రాజకీయ కుట్ర లేదు. తమ ప్రతినిధి ఎలాంటోడో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నాకేం స్వార్థం లేదు. అన్నా హజారే శిష్యుడిగా పోరాటం చేస్తున్నా. అంటూ రాజశేఖర్ మీడియాకు తెలిపాడు. ఇక ఆ వీడియోలో ఉంది తానేనని పేర్కొంటూ ఒక మహిళ ఓ ప్రముఖ కన్నడ ఛానెల్ లో ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం విశేషం.

వారిని వీడియో విడుదల చేయనివ్వండి. నేనేం తప్పు చేయలేదు. నాకేం భయం లేదు. నేను వృద్ధుడిని. అలాగని ఇలాంటి పనులు చేయలేనా? ఇప్పుడున్న టెక్నాలజీతో ఎక్కడైనా, ఎప్పుడైనా వీడియోలు తీయొచ్చు. చివరకు ఇంట్లో నా భార్యతో సన్నిహితంగా ఉన్న సమయంలో కూడా.. ఆ వ్యక్తి(రాజశేఖర్) ఎవరో నాకు తెలీదు. నా అనుచరులెవరూ ఆయన్ని బెదరించలేదు కూడా అని మేటి స్పష్టం చేస్తున్నాడు.      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Senior Karnataka minister  H Y Meti  Sex Scandal  

Other Articles