నాల్గవ రోజు పర్యటక జట్టుపై విరాట్ సేన పూర్తి అధిక్యం India secure massive lead

India spinners have england in tatters at stumps on day 4

India vs England, 4th Test,Day 3, Team India, virat kohli, murali viijay, ravichandran ashwin, jadeja, jayanth yadav, Cricket Scores, Mumbai Test, cricket news, sports, cricket, sports

India kept the pressure on England at stumps on Day 4 with the visitors 49 runs behind and four wickets in hand.

నాల్గవ రోజు పర్యటక జట్టుపై విరాట్ సేన పూర్తి అధిక్యం

Posted: 12/11/2016 05:59 PM IST
India spinners have england in tatters at stumps on day 4

టెస్టు సిరీస్ కు మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉత్సహం కనబరుస్తున్న టీమిండియా.. ముంబై లోని వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్టు నాల్గవ రోజు 'పర్యాటక జట్టు ఇంగ్లండ్ పై పూర్తి అధిపత్యాన్ని కనబర్చింది. మూడవ రోజు సాధించిన ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన విరాస్ సేన.. అద్యంతం పై చేయి కనబర్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి బాధ్యతాయుతంగా ఆడి డబుల్ సెంచరీ సాధించాడు. కాగా విరాట్ కు జతకలిసిన జయంత్ యాదవ్.. కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.

భారత్ తన ఇన్నింగ్స్ లో 631 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్లు కీలక భాగస్వామ్యాన్ని సాధించి జట్టును మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ ఇద్దరూ 241పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు.  ఇందులో కేవలం 23 ఫోర్లు మాత్రమే ఉండగా,  మిగతా వందకు పైగా పరుగులను సింగిల్స్, డబుల్స్ ద్వారానే సాధించాడు. మరొకవైపు జయంత్ యాదవ్(104;204 బంతుల్లో 15 ఫోర్లు) శతకంతో మెరిశాడు

ఇక ఇంగ్లండ్ మాత్రం ఓటమి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా పోరాడుతోంది.0 నాల్గో రోజు ఆట మగిసే సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉండటంతో భారత్ విజయం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ఈ రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో జెన్నింగ్స్(0), అలెస్టర్ కుక్(18), మొయిన్ అలీ(0)లు తీవ్రంగా నిరాశపరచగా, జో రూట్(77),బెయిర్ స్టో(50)హాఫ్ సెంచరీలు సాధించి పెవిలియన్ చేరారు. అయితే ఆరో వికెట్ గా బాల్(2)అవుటయ్యాడు.ఈ ఆరు వికెట్లలో జడేజా,అశ్విన్ లు తలో   రెండు వికెట్లు తీయగా,  జయంత్ యాదవ్,  భువనేశ్వర్ కుమార్ లకు చెరో  వికెట్ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles