గులాబీ గుబులు... ఏపీ, తమిళనాట డేంజర్ బెల్స్ |

Vardah cyclone turns as super cyclone

Vardah cyclone, Wardah Cyclone, Vardha Cyclone, Coastal Region Tamil Nadu andhra pradesh, Wardha alert, New Cyclone, Ap Cyvlone, Tamil Nadu Cyclone, Chennai Cyclone, AP Chennai Cyclone, Andhra Pradesh Cyclone, Wardah AP, India Cyclone, Vardah meaning, Vardah Rose, Vardah Cyclone Alert

Vardah cyclone to hits Coastal Region Tamil Nadu andhra pradesh on high alert.

వార్ధాతో నిజంగానే అంత డేంజర్ ఉందా?

Posted: 12/12/2016 08:10 AM IST
Vardah cyclone turns as super cyclone

ప్రచండ గాలులకు కేరాఫ్ అడ్రస్ అయిన వార్ధా తుపాను అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 180 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయింది. సోమవారం సాయంత్రానికి చెన్నై సమీపంలో తుపాను తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే దాని ప్రభావం ఏపీ కన్నా తమిళనాడుపైనే ఎక్కువ ఉంటుందని వారంటున్నారు.

ఇప్పటికే వార్ధా ప్రభావంతో తమిళనాడు తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. చెన్నై తీరంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే తిరువళ్లూరు, కాంచీపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 36 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

వార్ధా అంటే గులాబీ...
ప్రస్తుతం తమిళ, తెలుగు రాష్ట్రాలకు పెనుముప్పుగా భావిస్తున్న తుఫాన్ కి వార్ధా అని పేరుపెట్టిన విషయం తెలిసిందే. అరబిక్, ఉర్దూ భాషల్లో దీనికి అర్థం గులాబీ. మన దగ్గర తుపాన్లకు పేర్లు పెట్టే పద్దతి కొన్ని వందల ఏళ్ల క్రితమే మొదలైంది. గాలి వేగం గంటకు 39 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న హరికేన్‌లకు పేర్లు పెట్టేవారు. కరేబియన్‌ దీవుల్లోని ప్రజలు రోమన్‌ కేథలిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏరోజు హరికేన్‌ లేదా తుపాను ప్రారంభమవుతుందో ఆ రోజు పేరును ఆ తుపానుకు పెట్టేవారు. ఈ పద్ధతి రెండో ప్రపంచ యుద్ధ సమయం వరకు కొనసాగింది.

హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుపాన్లకు పేరు పెట్టడం 2000లో ప్రారంభమై 2004లో ఆచరణలోకి వచ్చింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు ఈ ప్రాంతంలో ఏర్పడిన తుపాన్లకు పేరు నిర్ణయిస్తాయి. ఈ ఎనిమిది దేశాలు కలసి 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించాయి. ప్రస్తుతం వార్ధాకు పేరు సూచించింది మాత్రం పాకిస్థానే.

తీవ్ర ప్రమాదం పొంచి ఉందా?
ప్రస్తుతం తీర ప్రాంతంలో గంటకు 100 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీని ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది.

తుపాను చెన్నైకు సమీపంలోని తీరం దాటనుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదేని ప్రళయం చోటుచేసుకుంటే, ప్రజల్ని రక్షించడం, ఆదుకునేందుకు తగ్గ సామగ్రి సిద్ధం చేశారు. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన తుపాను తీవ్రతకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.


నెల్లూరు కలెక్టరేట్‌ లో కంట్రోల్‌ రూం ఏర్పాటు ఎమర్జెన్సీ నంబర్ 1800 4252499

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vardah Cyclone  Andhra Pradesh Tamil Nadu High Alert.  

Other Articles