విశాఖ తీరానికి ముంచుకొస్తున్న మరో ముప్పు.. వాద్రా ‘Warda’ moving towards AP, might spare Odisha

Warda moving towards ap might spare odisha imd

Bay of Bengal, cyclonic storm, featured, Odisha, Warda, India Meteorological Department, Depression, Warda cyclone, Andhra Pradesh, cyclonic storm, visakhapatnam, Nicobar islands, Port Blair.

Warda’ turned depression over South East Bay of Bengal is likely to move northwestwards towards Andhra Pradesh coast and change into a cyclonic storm in the next 24 hours.

విశాఖ తీరానికి ముంచుకొస్తున్న మరో ముప్పు.. వాద్రా

Posted: 12/08/2016 10:52 AM IST
Warda moving towards ap might spare odisha imd

హుద్దూద్ తుఫాను మిగిల్చిన విషాదాల నుంచి తేరుకుంటున్న విశాఖ వాసులపైకి మరో ముప్పు ముంచుకోస్తుంది. విశాఖ తీరాన్ని లక్ష్యాంగా చేసుకుని వాద్రా తుఫాను దూసుకువస్తోంది.  ఇది రానున్న 72 గంటల్లో విశాఖ. ఒడిషా తీరాల వద్ద తీరం దాటే అవకాశాలు వున్నాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం క్రితం రోజు సాయంత్రం వరకు స్థిరంగా కొనసాగింది.

ఆ తర్వాత నుంచి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ రాత్రికి తీవ్రవాయుగుండంగా రూపం దాల్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,160, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,220 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం మరో 24 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.

ఇది మచిలీపట్నం-నెల్లూరుల మధ్య ఈనెల 11న తీరం దాటే అవకాశం ఉందని నాసా వాతావరణ విభాగం పేర్కొంది. 11 వరకు వాద్రా మరింత బలపడి పెను తుఫానుగా మారే అవకాశముందని, తీరం దాటే సమయంలో ఇది  ప్రభావం చూపనుందని, గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీయవచ్చని అంచనా వేస్తోంది. ఈ నెల 11నుంచి దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లోను వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు అదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles